Thangalaan trailer release date and time: 'చియాన్' విక్రమ్ కథానాయకుడిగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా 'తంగలాన్'. 'అట్టకత్తి', 'మద్రాస్', సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాల', 'కబాలి', ఆర్య 'సార్ పట్ట'తో తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న పా రంజిత్ ఈ సినిమాకు దర్శకుడు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ప్రొడ్యూస్ చేస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. 

Continues below advertisement


జూలై 10న విక్రమ్ 'తంగలాన్' ట్రైలర్ విడుదల!
కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో కన్నడ రాక్ స్టార్ యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ తీసిన 'కెజిఎఫ్' వచ్చింది. అయితే... అక్కడ జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా పా రంజిత్ ఈ 'తంగలాన్'ను తెరకెక్కిస్తున్నారు. ఆల్రెడీ విడుదలైన టీజర్ చూస్తే రా అండ్ రస్టిక్ ఫీల్ ఇచ్చింది. విక్రమ్ సహా మిగతా నటీనటుల ఆహార్యం అందర్నీ ఎంతో ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమా ట్రైలర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.






Thangalaan Trailer Release Date: జూలై 10న 'తంగలాన్' ట్రైలర్ విడుదల చేయనున్నట్లు స్టూడియో గ్రీన్ సంస్థ తెలిపింది. అంటే... ఈ బుధవారం (రేపే) ట్రైలర్ రిలీజ్ కానుంది. దాంతో పాటు విడుదల తేదీ కూడా అనౌన్స్ చేసే ఛాన్స్ ఉందని చెన్నై టాక్. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా కోసం విక్రమ్ తనను తాను కొత్తగా మార్చుకున్నారు. మేకోవర్ అయ్యారు. బాగా బరువు తగ్గారు.


Also Read: త్రిష తొలి వెబ్ సిరీస్ బృంద స్ట్రీమింగ్ డేట్ వచ్చేసింది - ఎప్పుడు, ఎక్కడో చూడొచ్చు అంటే?



Thangalaan Movie Cast And Crew: 'చియాన్' విక్రమ్ కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాలో మలయాళ కథానాయికలు మాళవిక మోహనన్, పార్వతి తిరువొతుతో పాటు పశుపతి, హరికృష్ణన్, అన్భు దురై తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్, కళా దర్శకుడు: ఎస్ఎస్ మూర్తి, కూర్పు: ఆర్కే సెల్వ, స్టంట్స్: 'స్టన్నర్' సామ్, నిర్మాణ సంస్థ: స్టూడియో గ్రీన్, నిర్మాత: కేఈ జ్ఞానవేల్ రాజా, దర్శకత్వం: పా రంజిత్.


Also Read: ఓటీటీలోకి ఈ వారమే సుధీర్ బాబు 'హరోం హర' - Prime Video, ETV Winలో కాదు, ఏ ఓటీటీలో వస్తుందో తెలుసా?