Viral Video: సోషల్ మీడియాలో ఫేమస్ అవడం కోసం యువత.. ఈ మధ్య ట్రాఫిక్ ఫుల్‌గా ఉన్న రోడ్డుపై రీల్స్ చేయడం, మెట్రో స్టేషన్‌లో డ్యాన్స్‌లు వేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇలానే ఓ అమ్మాయి.. కదులుతున్న స్కార్పియో వాహనంపై దర్జాగా ఫోజులిస్తూ కూర్చొని ఓ వీడియో చేసింది. ఆమె అనుకున్నంటే ఆ వీడియో వైరల్ అయింది. చాలా మంది దీనికి లైక్‌లు కొట్టారు. కానీ పోలీసులకు మాత్రం ఆ అమ్మాయికి షాకిచ్చారు.






ఇది ప్రమాదకరమైన స్టంట్ అని నోయిడా పోలీసులు ఆ స్కార్పియో కారును సీజ్ చేశారు. ఈ వీడియోలో, అమ్మాయి నెమ్మదిగా కదులుతున్న కారు బానెట్‌పై కూర్చుని ఉంది. నోయిడాలో ఈ వీడియోను షూట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై నోయిడా పోలీసులు చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు. 


Also Read: Sachin Tendulkar: అందరూ సచిన్‌నే చూశారు! కానీ వీడియోలో ఆ వ్యక్తిని గమనించారా?