Sachin Tendulkar: క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ గోవా బీచ్‌లో ఎంజాయ్ చేశారు. బీచ్ వాతావరణాన్ని సచిన్ ఆస్వాదించారు. బెనౌలిమ్ బీచ్‌లో సచిన్ ఉన్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితో అందరూ ఆ వీడియోలో సచిన్‌నే గమనించారు. కానీ ఆ వీడియోలో సచిన్ వెనుక ఉన్న ఓ వ్యక్తి వాటర్ స్కూటర్ కింద పడిపోయాడు. అతనిపై నుంచి ఆ వాటర్ స్కూటర్ వెళ్లిపోయింది. ఈ వీడియోను కొంతమంది గమనించి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఇది తెగ వైరల్ అవుతోంది.
అంతకుముందు
ఈ వీడియోలో సచిన్.. మత్య్సకారులతో సరదాగా ముచ్చటించారు. చేపలు పట్టే విధానంపై కొన్ని విషయాలు అడిగి తెలుసుకున్నారు. సముద్రం నుంచి మత్స్యకారుల బోటును ఒడ్డుకు లాగేందుకు వారికి సాయం చేస్తూ కనిపించారు. అనంతరం వారితో ఫొటోలు, సెల్ఫీలు తీసుకుంటూ సందడి చేశారు. అనంతరం బీచ్ ఒడ్డున ఉన్న ఓ రెస్టారెంట్‌లో ఫుడ్‌ను కుమారుడితో కలిసి సచిన్ ఎంజాయ్ చేశారు.
ఇందుకు సంబంధించిన వీడియోను సచిన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు. వీడియో షేర్ చేసిన గంటల వ్యవధిలోనే లక్షల్లో లైక్స్, వేలల్లో కామెంట్లు వచ్చాయి.
Also Read: Watch Video: నెట్టర నెట్టూ హైలెస్సా- కారు దిగి బస్సు తోసిన కేంద్ర మంత్రి!