కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బ్రేక్ డౌన్ అయిన ఓ బస్సును నెట్టేందుకు అనురాగ్ ఠాకూర్ సాయం చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.
ఇదీ జరిగింది
హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్నారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్. అయితే బిలాస్‌పుర్ నియోజకవర్గంలో ఆయన పర్యటిస్తుండగా ఓ ఇరుకు రోడ్డులో బస్సు బ్రేక్‌డౌన్ అయ్యింది. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. ఇది గమనించిన అనురాగ్.. తన కారు దిగి అక్కడున్న వారితో కలిసి బస్సును ముందుకు తోశారు.
అనంతరం బస్సు డ్రైవర్, ప్రయాణికులతో కాసేపు మాట్లాడి వారి యోగక్షేమాలు తెలుసుకున్నారు. ట్రాఫిక్ సర్దుకున్నాక అక్కడి నుంచి ప్రచారానికి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.