Stocks to watch today, 10 November 2022: ఇవాళ (బుధవారం) ఉదయం 7.45 గంటల సమయానికి, సింగపూర్ ఎక్సేంజ్‌లో నిఫ్టీ ఫ్యూచర్స్ (SGX నిఫ్టీ ఫ్యూచర్స్) 56.5 పాయింట్లు లేదా 0.31 శాతం గ్రీన్ కలర్‌లో 18,137 వద్ద ట్రేడవుతోంది. మన మార్కెట్ ఇవాళ నెగెటివ్‌గా ప్రారంభం అవుతుందని SGX నిఫ్టీ సూచిస్తోంది.
ఇవాళ Q2 ఫలితాలు ప్రకటించనున్న మేజర్ కంపెనీలు: అదానీ గ్రీన్ ఎనర్జీ, ఐషర్ మోటార్స్, అపోలో హాస్పిటల్ ఎంటర్‌ప్రైజెస్, పేజ్ ఇండస్ట్రీస్, జొమాటో, ట్రెంట్, జిందాల్ స్టీల్ & పవర్, ఇండియన్ హోటల్స్ కంపెనీ, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సంవర్ధన మదర్సన్ ఇంటర్నేషనల్, NHPC
నేటి ట్రేడ్‌లో చూడాల్సిన స్టాక్స్ ఇవి:
యాక్సిస్ బ్యాంక్: స్పెసిఫైడ్ అండర్‌టేకింగ్ ఆఫ్ యూనిట్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (SUUTI) ద్వారా, ఈ ప్రైవేట్ లెండర్‌లో 46.5 మిలియన్ షేర్లు లేదా మొత్తం 1.55% వాటాను ప్రభుత్వం ఇవాళ, రేపు అమ్మబోతోంది. రూ. 830.63 ఫ్లోర్ ప్రైస్‌కు OFS రూట్‌లో షేర్లను ఆఫ్‌లోడ్ చేయబోతోంది.
టాటా మోటార్స్: జాగ్వార్ ల్యాండ్ రోవర్, దేశీయ అమ్మకాలు, వాణిజ్య వాహనాల విభాగం పుంజుకోవడంతో 2022 సెప్టెంబర్‌తో ముగిసిన రెండో త్రైమాసికంలో ఏకీకృత నికర నష్టాన్ని రూ. 945 కోట్లకు ఈ ఆటో మేజర్ తగ్గించింది. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 4,442 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది.
హిందుస్థాన్ యూనిలీవర్, GSK: ఓవర్ ది కౌంటర్ (OTC), ఓరల్ కేర్ ఉత్పత్తుల విక్రయానికి సంబంధించిన తమ ఒప్పందాన్ని రద్దు చేయాలని ఈ రెండు కంపెనీలు నిర్ణయించుకున్నాయి. GSK యాజమాన్యంలో ఉన్న క్రోసిన్, ఈనో, ఐయోడెక్స్, ఓస్టోకాల్షియం, ఓట్రివిన్, సెన్సోడైన్ వంటి బ్రాండ్‌ల కోసం ఈ ఒప్పందం జరిగింది.
అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్: 'ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ లిమిటెడ్'లో 49.38 శాతం వాటాను రూ. 1,050 కోట్లకు ఈ అదానీ గ్రూప్ సంస్థ కొనుగోలు చేసింది. 'ఇండియన్ ఆయిల్ ట్యాంకింగ్ లిమిటెడ్' లిక్విడ్ స్టోరేజీ సౌకర్యాలను అందిస్తుంది, నిర్వహిస్తుంది.
లుపిన్: సెప్టెంబర్ త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం రూ.130 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్ కాలంలో రూ. 2,098 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. ఆ నష్టాల నుంచి లాభాల్లోకి మళ్లింది.
టాటా పవర్ కంపెనీ: మహారాష్ట్రలోని షోలాపూర్‌లో 150 మెగావాట్ల సోలార్ ప్రాజెక్టును ఏర్పాటు చేసేందుకు, మహారాష్ట్ర స్టేట్ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ (MSEDCL) నుంచి తన అనుబంధ సంస్థ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ 'లెటర్ ఆఫ్ అవార్డు' అందుకున్నట్లు టాటా పవర్ తెలిపింది. PPA అమలు తేదీ నుంచి 18 నెలల్లో ప్రాజెక్ట్ ప్రారంభం అవుతుంది.
పిరామల్ ఎంటర్‌ప్రైజెస్: పిరామల్ గ్రూపునకు చెందిన ఈ ఆర్థిక సేవల విభాగం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో రూ. 1,536 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేసింది. దివాలా ప్రక్రియ ద్వారా 2021 సెప్టెంబర్‌లో కొనుగోలు చేసిన దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ కార్పొరేషన్ (DHFL) ఆర్థిక సంఖ్యలు కూడా పిరామల్ ఎంటర్‌ప్రైజెస్ క్వాటర్లీ రిపోర్ట్‌లో ఉన్నాయి.
పిడిలైట్ ఇండస్ట్రీస్: ముడిసరుకు ద్రవ్యోల్బణం, అధిక రేటుకు కొన్న ఇన్వెంటరీ కారణంగా FY23 రెండో త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 10.06 శాతం క్షీణించి రూ. 337.75 కోట్లకు చేరుకుంది. ఏడాది క్రితం జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ. 375.53 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.