Viral video: మైక్ విసిరేసిన మంత్రి- కార్యకర్తలు మాట వినడం లేదని, వైరల్ వీడియో!

Advertisement
ABP Desam   |  Edited By: Murali Krishna Updated at: 16 Oct 2022 04:35 PM (IST)

Viral video: కార్యకర్తలు మాట వినడం లేదని మైక్ విసిరి కొట్టారు ఓ మంత్రి. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఈ ఘటన జరిగింది.

మైక్ విసిరేసిన మంత్రి!

NEXT PREV

Viral video: ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా మంత్రి ఒకరు తన కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయారు. కార్యకర్తలు మాట వినకపోయేసరికి వారి ముఖంపైకి మైకు విసిరేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Continues below advertisement


ఇదీ సంగతి


ఉత్తర్‌ప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి సంజయ్ నిషాద్.. శనివారం మౌలో జరిగిన పార్టీ సమావేశంలో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రసంగాన్ని భాజపా కార్యకర్తలు పట్టించుకోకుండా ఒకరితో ఒకరు మాట్లాడుకుంటున్నారు. ఇది గమనించిన మంత్రి సంజయ్‌ నిషాద్‌ సహనం కోల్పోయారు. కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మైక్‌ను విసిరేశారు.







నువ్వు నా కంటే పెద్ద రాజకీయ నాయకుడివైతే మాట్లాడు, లేకపోతే విను. మీరు ఉన్నత స్థాయి రాజకీయ నాయకులా? మీరు పార్టీ కార్యకర్తలు.. ఇతరుల అడుగుజాడలను అనుసరిస్తారు. మీరు నాశనం అవుతారు. మీకు ఏమి కావాలి? మీ పతనమా? నేను ప్రసంగిస్తున్నప్పుడు వినకుండా ఎందుకు మాట్లాడుతున్నారు.                                           -    సంజయ్ నిషాద్, యూపీ మంత్రి


ఇది చూసిన పార్టీ కార్యకర్తలు, నేతలు షాక్‌ అయ్యారు. ఆయనకు నచ్చజెప్పి మాట్లాడటం కొనసాగించాలని కోరారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Also Read: Congress presidential poll: సోమవారమే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలు- రాహుల్ గాంధీ ఓటేస్తారా?

Published at: 16 Oct 2022 04:23 PM (IST)
Continues below advertisement
© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.