విశాఖపట్నం కార్యనిర్వహక రాజధాని విషయంలో టీడీపీ, జనసేన పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాల్సిందేనని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తేల్చి చెప్పారు. విశాఖ గర్జన కార్యక్రమం ఉత్తరాంధ్ర ప్రజల ఆలోచనకు ఆలోచనకు అద్దం పట్టిందని, అది విజయవంతం అయిందని గుర్తు చేశారు. విశాఖ రాజధాని వద్దని వ్యతిరేకిస్తున్న వారికి ఇది ఒక కనువిప్పు అని అన్నారు. కు రాజధాని వద్దని గొంతులెత్తుతున్న వారికి ఓ కనువిప్పు అని పేర్కొన్నారు. విశాఖకు రాజధాని వద్దనే వాళ్లు తమ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. బొత్స సత్యనారాయణ విశాఖపట్నంలో విలేకరులతో మాట్లాడారు.


విశాఖ గర్జన కార్యక్రమంపై జనసేన పార్టీ వ్యవహరించిన తీరుపైన బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. జనసేనకు ఓ విధానం అనేది ఉందా? అని ప్రశ్నించారు. జనసేన అసలు రాజకీయ పార్టీనేనా? అని ప్రశ్నించారు. జనసేన ఓ సెలబ్రిటీకి చెందిన పార్టీ అని ఎద్దేవా చేశారు. అసలు దానికి రాజకీయ పార్టీ లక్షణమే లేదని అన్నారు. విశాఖపట్నానికి రాజధాని వద్దని పవన్ ఎందుకు వద్దంటున్నారని నిలదీశారు.


ఆయన గాజువాక నుంచి పోటీ చేసినప్పుడు ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పలేదా? అని అన్నారు. ఎయిర్ పోర్టులో సంఘటనను చంద్రబాబు తప్పు పట్టడం పోయి.. పోలీసులను తప్పు పట్టారని గుర్తు చఏశారు. ఏ చిన్న సంఘటన జరిగినా చంద్రబాబు లేఖలు రాస్తున్నారు కదా అని అన్నారు. మంత్రులపై దాడిని ఎందుకు తప్పు పట్టరని, రాజధాని అంటే ఎయిర్ కనెక్టివిటీ.. సీ కనెక్టివిటీ ఉండాలని అన్నారు. రైల్ కనెక్టివిటీ కూడా బాగా ఉండాలని అన్నారు. అమరావతికి ఏ కనెక్టివిటీ ఉందని అన్నారు. విశాఖకు కొద్దిపాటి ఖర్చు పెడితే అద్భుతమైన అభివృద్ధి జరుగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పారు.


విశాఖపట్నం మీద, ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల మీద ద్వేషం ఎందుకని ప్రశ్నిచారు. విశాఖకు రాజధాని వచ్చి తీరడం ఖాయమని మరోసారి స్పష్టం చేశారు. నగరంలో ఇంటింటికి వెళ్లి బ్యాలెట్ పెట్టె పడితే ప్రజల అభిప్రాయం ఏంటో తెలిసిపోతుందని అన్నారు. ఇంత భారీ స్థాయిలో విశాఖ గర్జన జరుగుతుంటే.. రాజధాని వద్దని టీడీపీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టిందని విమర్శించారు. అసలు ఉత్తరాంధ్రకు టీడీపీ అవసరమా? అని ప్రశ్నించారు. అమ్మ పెట్టా పెట్టదు.. అడుక్కు తిననివ్వదన్నట్టుగా వారి పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు.