Viral News in Telugu: యూపీలో కొందరు ఆకతాయిలు బైక్‌పై వెళ్తున్న మహిళను వేధించారు. లక్నోలో తాజ్ హోటల్‌ ఎదుట పెద్ద ఎత్తున నీళ్లు నిలిచిపోయాయి. ఆ నీళ్లలో ఆడుకునేందుకు యువకులు వచ్చారు. ఒకరిపై ఒకరు నీళ్లు చల్లుకుంటా కేరింతలు కొట్టారు. అదే రోడ్డులో బైక్‌పై ఓ యువకుడు, యువతి వచ్చారు. వాళ్లు వస్తుండగానే చుట్టూ ఉన్న యువకులు ఆటపట్టించడం మొదలు పెట్టారు. వెనక ఉన్న యువతిపై నీళ్లు చల్లారు. అయినా ముందుకు వెళ్లిపోతుండగా వెనక నుంచి వచ్చి బైక్‌ని గట్టిగా పట్టుకున్నారు. బైక్‌పై ఉన్న ఇద్దరూ కింద పడిపోయారు. అంతకు ముందు ఓ యువకుడు ఆ యువతిని అసభ్యంగా తాకాడు. తరవాత అంతా కలిసి బైక్‌ని అడ్డగించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే...ఈ ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి వెళ్లారు. ఆ యువకులను అక్కడి నుంచి తరిమేశారు. యువతితో అసభ్యంగా ప్రవర్తించిన వాళ్లను గుర్తించే పనిలో ఉన్నారు. (Also Read: Himachal Pradesh: హిమాచల్‌ ప్రదేశ్‌నీ ముంచెత్తుతున్న వర్షాలు, క్లౌడ్‌ బరస్ట్‌ కారణంగా 50 మంది గల్లంతు)






ఈ ఘటన రాజకీయంగానూ అలజడి సృష్టించింది. వెంటనే స్పందించిన యోగి సర్కార్ నలుగురు పోలీసులను సస్పెండ్ చేసింది. ఇందులో డీసీపీ కూడా ఉన్నారు. నిందితులను అరెస్ట్ చేసినట్టు ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. క్రైమ్‌ బ్రాంచ్ పోలీసులు రంగంలోకి దిగి వాళ్లను అరెస్ట్ చేశారు. అంతకు ముందు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ ఈ ఘటనపై స్పందించారు. ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 


"ప్రభుత్వం ఈ ఘటనపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలి. చాలా మంది వీడియోలు తీశారు. వాటిని సాక్ష్యాలుగా తీసుకోవాలి. ఎవరు ఈ పని చేశారో గుర్తించాలి. మొదట్లో స్క్వాడ్స్‌ ఏర్పాటు చేసి కొంత వరకూ ఇలాంటి వాటిని అడ్డుకోగలిగారు. కానీ ఆ తరవాత మళ్లీ నిర్లక్ష్యం చేశారు. మహిళల భద్రత కోసం యూపీ ప్రభుత్వం 1090 సర్వీస్‌ని మళ్లీ మొదలు పెట్టాలి"


- డింపుల్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ






Also Read: SC Sub Classify: ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు, సబ్‌ కోటా ఉండొచ్చని తేల్చి చెప్పిన న్యాయస్థానం