SC Classification: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు ఇచ్చింది. వర్గీకరణకు రాష్ట్రాలకు అధికారం కల్పిస్తూ తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణపై రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని కోర్టు స్ఫష్టం చేసింది. విద్య, ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం వర్గీకరణ చేపట్టేందుకు లైన్ క్లియర్ చేసింది. చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ సహా ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పు వెల్లడించింది. ఎస్సీ వర్గీకరణకు తాము అనుకూలమే అని ఇప్పటికే కోర్టుకి కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇవాళ కోర్టు తీర్పు వెలువరించింది. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ధర్మాసనంలో 6:1 మెజార్టీతో ఈ తీర్పు వెల్లడైంది.
జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ అంశంపై మొత్తం ఆరు ప్రత్యేక తీర్పులను వెల్లడించింది సుప్రీంకోర్టు. కోటాలో సబ్ కోటా ఉండడం తప్పు కాదని స్పష్టం చేసింది. అంతకు ముందు 2004లో ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధ్రప్రదేశ్ కేసులో వర్గీకరణ సాధ్యం కాదని వెల్లడించింది. ఇప్పుడు ఈ తీర్పుని పక్కన పెడుతూ వర్గీకరణను సమర్థించింది ధర్మాసనం. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈ అంశంపై మూడు రోజుల పాటు కేసు విచారణ జరిగింది. ఈ విచారణ తరవాత కోర్టు తీర్పుని రిజర్వ్‌లో ఉంచింది. ఇప్పుడు తీర్పు వెల్లడించింది.
"వ్యవస్థాపరమైన వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గానికి చెందిన వాళ్లు అన్ని అవకాశాలనూ అందిపుచ్చుకోలేకపోతున్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం కుల వర్గీకరణను చేయొచ్చు. కోటాలో సబ్‌కోటా ఉండడం తప్పేమీ కాదు"
- సుప్రీంకోర్టు
ఈ ఏడాది ఫిబ్రవరిలో విచారణ జరిగిన సమయంలో కేంద్రం కీలక విషయాలు కోర్టుకి వెల్లడించింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణను తాము సమర్థిస్తున్నామని స్పష్టం చేసింది. దీన్ని పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ తీర్పునిచ్చింది. అయితే...జస్టిస్ బేలా త్రివేది మాత్రం ఈ తీర్పుతో విభేదించారు. ఈ వర్గీకరణ సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ అధికారం కల్పించడాన్ని వ్యతిరేకించారు. మిగతా 6గురు సభ్యులు మాత్రం ఒకే అభిప్రాయంతో తీర్పు వెలువరించారు.
Also Read: Wayanad Landslides: విపత్తు నిర్వహణ చట్టంలో మార్పులకు కేంద్రం సిద్ధం, వయనాడ్ విధ్వంసంతో కీలక నిర్ణయం