Telangana News: సినిమాలపై మోజు ఆమెను సమస్యల్లో పడేసింది. ఇప్పుడు ఏకంగా పోలీసు స్టేషన్ మెట్లు ఎక్కాల్సి వచ్చింది. సాఫీగా సాగిపోతున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని కాదని సినిమాల్లో నటించాలనే ఆమెను బాధితురాలిగా చేసింది. రాయలసీమకు చెందిన ఓ యువతిని సినిమాల్లో ఛాన్స్‌లు ఇప్పిస్తానని చెప్పి ఓ వ్యక్తి మోసం చేశాడు. తాను అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేస్తున్నానని చెప్పి ఆమెపై అత్యాచారం చేశాడు.
హైదరాబాద్ పుప్పలగూడలో నివాసం ఉంటూ ఐటీ కారిడార్‌లోని ఓ సాప్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది రాయలసీమకు చెందిన యువతి. ఆమెకు సినిమాల్లో నటించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది. ఆ ప్రయత్నాల్లో ఉన్న ఆమెను సిద్ధార్థ్ వర్మ అనే యువకుడు తగిలాడు. పరిచయం పెంచుకున్నాడు తర్వాత మోసం చేశాడు.
వైజాగ్‌కు చెందిన సిద్ధార్థ్‌వర్మ కొండాపూర్ రాఘవేంద్ర కాలనీలో ఉంటున్నాడు. సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా పని చేస్తున్నానని చెప్పుకొని తిరిగేవాడు. కామన్ ఫ్రెండ్ ద్వారా రాయలసీమ యువతితో పరిచయం ఏర్పడింది. సినిమా ఛాన్స్‌లు ఇప్పిస్తానని చెప్పి ఆమెకు క్లోజ్ అయ్యాడు.
కొన్ని రోజులు పోయిన తర్వాత డిన్నర్ మీటింగ్ అని చెప్పి ఆ యువతిని తన ఇంటికి రప్పించుకున్నాడు. కూల్‌డ్రింక్‌లో మత్తమందు కలిపి ఆ అమ్మాయిపై అఘాయిత్యం చేశాడు. దాన్ని చూపించి బ్లాక్‌మెయిల్ చేసి మరికొన్నిసార్లు అదే పని చేశాడు. సినిమాల్లో ఛాన్స్‌ల పేరుతో ఇలా పదే పదే అత్యాచారం చేస్తుండటంపై పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.
సిద్దార్థ్ వర్మపై గచ్చిబౌలి పోలీసులకు యువతి ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసుకున్న పోలీసులు సిద్ధార్థ్ వర్మను అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టి రిమాండ్‌కు తరలించారు గచ్చిబౌలి పోలీసులు.
Also Read: చిత్తూరు జిల్లా రొంపిచర్లలో దారుణం- పనులు చేయలేదని కూతుర్ని చంపిన తండ్రి
మూడు రోజుల్లో మూడో కేసు
హైదరాబాద్‌లో గత రెండు రోజుల్లో మూడు అత్యాచారం కేసులు నమోదు అయ్యాయి. కదిలే బస్సులో ఓ మహిళపై డ్రైవర్ అత్యాచారం చేశాడు. నిర్మల్ నుంచి వస్తున్న బస్‌లో ఆమె కాళ్లు చేతులు కట్టేసి నోటిలో గుడ్డలు కుక్కి అత్యాచారం చేశాడని చెబుతున్నారు ఓయూ పోలీసులు. విషయాన్ని గమనించిన తోటి ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతానికి డ్రైవర్ పరారీలో ఉన్నాడు. అతని కోసం గాలిస్తున్నారు.
వనస్థలిపురంలో స్నేహితులే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌పై అత్యాచారం చేశారు. స్థానికంగా ఉన్న రెస్టారెంట్‌కు యువతి మరో యువకుడు వెళ్లాడు. అక్కడ వాళ్లు డిన్నర్ చేస్తున్నటైంలో మరో యువకుడి ఫ్రెండ్ వచ్చాడు. వారిద్దరు మద్యం తాగిన మత్తులో యువతిపై అత్యాచారం చేశారని ఆమె ఫిర్యాదు చేశారు. మూడు రోజులలో జరిగిన మూడు ఘటనల్లో బాధితులు ఇద్దరు కూడా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లే కావడం ఆందోళన కలిగిస్తోంది.
Also Read: హైదరాబాద్‌లో చిన్నారిపై హత్యాచారం కేసు - దోషికి మరణశిక్ష