Viral Video: దిల్లీలో షాకింగ్ ఘటన జరిగింది. ఓ అల్లరి మూక ఏకంగా పోలీసు స్టేషన్‌లోకి చొరబడి కానిస్టేబుల్‌పై దాడికి పాల్పడింది. కానిస్టేబుల్‌పై దాడి చేస్తున్నప్పటికీ పోలీసులు చూస్తూ ఉండిపోయారు. అంతేకాకుండా ఆ ఘటనను పోలీసులే వీడియో తీశారు.






ఎందుకు దాడి?


దిల్లీలోని ఆనంద్‌ విహార్ పోలీస్‌ స్టేషన్‌లో ఈ ఘటన జరిగింది. 10 నుంచి 12 మంది అల్లరి మూక ఒకేసారి పోలీస్‌ స్టేషన్‌లోకి చొరబడ్డారు. అక్కడున్న హెడ్ కానిస్టేబుల్‌ను దుర్భాషలాడుతూ రెచ్చిపోయారు. అనంతరం కానిస్టేబుల్‌పై దాడి చేశారు. ఈ ఘటన ఆగస్టు 3నే జరిగినప్పటికీ ఆలస్యంగా బయటకు వచ్చింది.






ఏం చేయని పోలీసులు?


10-12 మంది అల్లరి మూక ఒకేసారి పోలీసు స్టేషన్‌లోకి చొరబడడంతో పోలీసులు షాక్ అయ్యారు. హెడ్ కానిస్టేబుల్‌పై దాడి చేసినప్పటికీ చూస్తూ ఉండిపోయారు. అంతేకాకుండా ఆ దాడిని వీడియోలు కూడా పోలీసులే తీశారు. ఈ దాడికి గల కారణాలు తెలియలేదు.


వీడియోలు వైరల్‌గా మారి ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో ఈ విషయాన్ని వారు సీరియస్‌గా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై దర్యాప్తు ప్రారంభించామని, నిందితులను పట్టుకునే ప్రయత్నంలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు.


Also Read: HIV Positive: ఇదేందిరా బాబూ- టాటూలు వేసుకున్న ఇద్దరికి HIV పాజిటివ్‌!


Also Read: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 40 మంది మృతి