Bribery of ACB: కర్నూలు జిల్లా ఆలూరులో రెవిన్యూ అధికారులు 15 వేల రూపాయలను లంచం డిమాండ్ చేస్తున్న ఆడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. స్థానికంగా ఉండే రాజకీయ నాయకుల నుండి మామూళ్లను వసూలు చేస్తున్న అవినీతి నిరోధక శాఖ అధికారుల వ్యవహారం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. ఆలూరు నియోజకవర్గంలో అనిశా అధికారులు రేషన్ డీలర్ కోసం 15,000 లంచాన్ని డిమాండ్ చేశారు. అందులో రూ. 10,000 అధికారికి, రూ. 5,000 మరొక అధికారికి అంటూ ఫోన్ లో మాట్లాడుకున్నారు. ఈ ఆడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కడుతోంది. 


డబ్బులిస్తే డీలర్ షిప్ నీదేనయ్యా..!


గతంలో ఉన్న డీలర్ ను తొలగించి కొత్త డీలర్ ను నియమించడం కోసం అవినీతి నిరోదక శాఖ అధికారులు ఓ వ్యక్తి దగ్గర 15 వేల రూపాయలను డిమాండ్ చేశారు. అలాగే ఆ డబ్బులు త్వరగా చెల్లిస్తే మీకే డీలప్ షిప్ వస్తుందంటూ అధికారి చెప్పడం గమనార్హం. డబ్బులు ఇస్తాం కానీ.. డీలర్ షిప్ నిజంగానే వస్తుందా లేదా అని వ్యక్తి అడగ్గా.. అలా ఏం లేదు. ఏం చేసినా జేసీ దగ్గరికి వెళ్లిన ఆ డీలర్ షిప్ మీకే వస్తుందంటూ హామీ ఇచ్చాడు ఆ అధికారి. సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారిన ఈ ఆడియో క్లిప లోని మాటలపై ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందిస్తున్నారు. అవినీతి అడ్డుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం, లంచం తీస్కోవడం ఏంటంటూ నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు. 


అవినీతి జరగకుండా చూడాల్సిన వాళ్లే లంచం అడగడం ఏంటయ్యా..?


ఏ డిపార్టుమెంటుకు సంబంధించిన వాళ్లయినా సరే అవినీతి చేస్తే.. వారిని ప్రశ్నించి, విచారణ జరిపి, నిందితులను పట్టుకోవాల్సిన అధికారులే అవినీతి చేయడం చాలా దారుణం అని చెబుతున్నారు. ఇలాంటి అధికారులను వెంటనే పదవిలోంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. అవినీతి నిరోధక శాఖలోనే ఇంత అన్యాయం జరగుతుంటే.. ఇంక బయట పరిస్థితి ఎలా ఉంటుందో అంటూ మరికొంత మంది కామెంట్లు చేస్తున్నారు. పేద ప్రజలకు అండగా నిలబడుతూ.. అవినీతి పరులపై పంజా విసరాల్సిన అధికారులు లంచం అడగడం నిజంగా సిగ్గుపడాల్సి విషయం అని అంటున్నారు. ఇప్పటికైనా ఇలాంటి అధికారులను పదవుల నుంచి తప్పించి.. పేద ప్రజలకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు.  


Also Read: Chikoti Case : చికోటి కేసినో కేసులో నలుగురు ప్రముఖులకు ఈడీ నోటీసులు - అందులో ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా ?