HIV Positive: ఈ మధ్య కాలంలో టాటూలు చాలా ఫేమస్ అయ్యాయి. చాలా మంది టాటూలు ఫ్యాషన్ కోసం వేసుకుంటున్నారు. అయితే టాటూలు వేసుకున్న ఇద్దరికి ఇటీవల హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలింది. ఈ వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది.
ఏమైంది
ఉత్తర్‌ప్రదేశ్ వారణాసిలో ఈ ఘటన జరిగింది. పచ్చబొట్లు వేసుకున్న ఇద్దరికి హెచ్‌ఐవీ పాజిటివ్‌గా తేలడం కలకలం రేపింది. వారణాసికి చెందిన 14 మంది అస్వస్థతతో పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ్ ఆసుపత్రిలో చేరారు. వీరికి జ్వరం లక్షణాలు ఉండగా.. టైఫాయిడ్, మలేరియాతోపాటు పలు పరీక్షలు నిర్వహించారు. అయినా అన్ని టెస్టుల్లోనూ నెగెటివ్ వచ్చింది. వైద్యులకు ఏమీ అంతుపట్టలేదు.
చివరికి
జ్వరం తగ్గకపోవడంతో వారికి హెచ్‌ఐవీ పరీక్షలు చేయించారు. 20 ఏళ్ల యువకుడు, 25 ఏళ్ల యువతికి పాజిటివ్‌గా తేలింది. కానీ హెచ్‌ఐవీ పాజిటివ్‌గా ఉన్న వ్యక్తులతో శారీరకంగా వారు కలవలేదని వాళ్లు చెప్పారు. వారి రక్తం ద్వారా కూడా ఈ వ్యాధి సోకలేదని తేలింది.
అయితే ఈ 14 మంది కూడా ఈ మధ్యే టాటూలు వేసుకున్నట్లు గుర్తించారు. ఒకే సెంటర్‌లో వీరంతా టాటూలు వేసుకున్నారు. వారికి ఒకే సూదితో ఈ పచ్చబొట్లు వేసినట్లు దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ధర ఎక్కువని
టాటూలు వేసే సూదుల ధరలు అధికంగా ఉన్న కారణంగా డబ్బు ఆదా చేసుకునేందుకు కొన్ని షాపుల్లో ఇలా ఒకే సూదితో టాటూలు వేస్తున్నట్లు డాక్టర్లు అంటున్నారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని, టాటూలు వేయించుకునే ముందు సూది కొత్తదో, పాతదో నిర్ధరించుకున్న తర్వాతే పచ్చబొట్టు వేసుకోవాలని సూచిస్తున్నారు.
Also Read: Corona Cases: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు- 40 మంది మృతి
Also Read: Chandrababu Modi Meet: హాట్ టాపిక్‌గా మోదీ-చంద్రబాబు మీటింగ్, చాన్నాళ్ల తర్వాత మళ్లీ ఇలా!