Kerala Viral Video: 


ఇదో వెరైటీ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ..


వెడ్డింగ్ ఫోటోగ్రఫీ ఈ మధ్య చాలా పెద్ద బిజినెస్ అయిపోయింది. ప్యాకేజ్‌ల లెక్కన భారీ మొత్తంలో వసూలు చేస్తూ అందమైన ఫోటోలను తీస్తున్నారు ఫోటోగ్రాఫర్లు. ఆనందమైన క్షణాల్ని ఫోటోల్లో దాచుకోవాలనుకునే వారంతా ఈ ప్యాకేజ్‌లను సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంత ఖర్చైనా సరే...ఫోటోలు, వీడియోలు చాలా రిచ్‌గా రావాలని కోరుకుంటున్నారు. ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఫోటోగ్రాఫర్లు తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు. గతంలో ఎన్నో సార్లు వెరైటీ వెడ్డింగ్ ఫోటో షూట్‌లు చూశాం. ఓ జంట పొలం పనులు చేస్తూ ఫోటోలు దిగితే..మరో జంట కేవలం దుప్పట్లు కప్పుకుని ఫోటోలు దిగి అప్పట్లో పెద్ద హడావుడే చేసింది సోషల్ మీడియాలో. ఆ తరవాత ఎన్నో జంటలు ఆ ట్రెండ్‌ను కొనసా గించాయి. కొందరు వృద్ధులు కూడా...ఈ మురిపెం తీర్చుకున్నారు. అలాంటి ఫోటో షూట్‌లో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి. ఇప్పుడు కేరళలో ఓ ఫోటోషూట్‌ వైరల్ అవుతోంది. ఓ పెళ్లికూతరు ఫోటోలు దిగాలని అనుకుంది. సాధారణంగా అందమైన లొకేషన్స్‌లో షూట్ చేస్తే బాగుంటుందని అనుకుంటారు అమ్మాయిలు. కానీ...ఈ వధువు మాత్రం కాస్త డిఫరెంట్‌గా ఆలోచించింది. తన ఏరియాలో రోడ్లు ఎంత దారుణంగా ఉన్నాయో అందరికీ తెలియాలని అనుకుంది. ఇంకేముంది ఫోటోగ్రాఫర్‌ను రోడ్డుపైకి తీసుకొచ్చి ఆ గుంతలు పడ్డ రోడ్‌పైనే ఫోటోలు దిగింది. వీడియోలు కూడా తీయించుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది. 






ఇన్‌స్టాలో లక్షల కొద్ది వ్యూస్‌ 


ఎర్ర చీర కట్టుకున్న వధువు గుంతలు పడ్డ రోడ్డుపైన నడుచుకుంటూ వస్తుంటే...ఫోటోగ్రాఫర్ ఆ స్టిల్స్ తీశాడు. వెనకాల ఎంతో మంది వాహనదారులు ఆ రోడ్‌లో వెళ్లేందుకు ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ వీడియో చాలా క్లియర్‌గా కనిపించింది. ఎక్కడ పడిపోతామో అని చాలా జాగ్రత్తగా బండ్లు నడుపుతున్నారంతా. ఇన్‌స్టాగ్రామ్‌లో Arrow_weddingcompany పేజ్‌లో ఈ ఫోటోలు, వీడియోలు షేర్ చేశారు. మిలియన్‌ కొద్ది వ్యూస్ వచ్చాయి. నెటిజన్లు రకరకాల కామెంట్‌లు పెడుతున్నారు. గత నెల 9వ తేదీన కేరళ హైకోర్టు NHAIకి ఆదేశాలు జారీ చేసింది. వీలైనంత త్వరగా రోడ్‌ను మరమ్మతు చేయాలని తేల్చి చెప్పింది. ఈ క్రమంలోనే...ఈ అమ్మాయి ఇలా అక్కడ ఫోటోలు దిగటం వైరల్ అయింది. 


Also Read: Protest Outside Hindu Temple: హిందూ ఆలయం బయట ముస్లింల నిరసన, అల్లాహు అక్బర్ అంటూ నినాదాలు