Viral Video:
"పులిని దూరం నుంచి చూడాలనిపించింది అనుకో చూస్కో..
పులితో ఫొటో దిగాలనిపించిందనుకో కొంచెం రిస్క్ అయినా పర్వాలేదు ట్రై చేయొచ్చు..
సరే చనువిచ్చింది కద అని పులితో ఆడుకుంటే మాత్రం వేటాడేస్తది!"
ఇది యమదొంగ సినిమాలో జూ. ఎన్‌టీఆర్ చెప్పిన డైలాగ్. సడెన్‌గా ఈ డైలాగ్ ఎందుకు గుర్తొచ్చింది అనుకుంటున్నారా? సాధారణంగా పులిని చూస్తేనే భయపడతాం. అలాంటింది ఓ యువతి ఏకంగా చిరుత పులిని ముద్దాడింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ సంగతి
కుక్కల్ని, పిల్లుల్ని, పక్షుల్ని ముద్దాడటం మనం చూసే ఉంటాం. చిరుతను ముద్దాడటం ఏంటి? అని అవాక్కవుతున్నారా? ఆఫ్రికన్ ఎనిమల్ ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో ఇటీవల ఓ వీడియోను పోస్టు చేశారు. అందులో చిరుత వద్ద పడుకుని ఉన్న ఓ యువతి దాన్ని ముద్దాడుతూ కనిపించింది.
అయితే చిరుత కూడా ఏమీ అనకుండా ఉండటం అందరినీ ఆశ్చర్యపరిచింది. కొన్ని సెకన్లు మాత్రమే ఉన్న ఈ వీడియో సోషస్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Bihar News: 'సాయి బాబా సీరియల్ చూశాను- తర్వాత ఓ అద్భుతం జరిగింది'