కప్పుడు భారత టూ వీలర్ మార్కెట్ లో ట్రెంట్ సెట్టర్ గా నిలిచిన బైక్ యమహా ఆర్‌ఎక్స్‌ 100. ఈ బైక్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. యంగ్ ఏజ్ నుంచి ముసలి వాళ్ల వరకు ఈ బైక్ నడిపేందుకు ఎంతో ఉత్సహం చూపించే వాళ్లు. దేశీయంగా ఈ బైక్ పొంది ప్రజాదరణ మరే బైక్ పొందలేదని చెప్పుకోవవచ్చు. యమహా,  ఆర్ఎక్స్ 100 బైకును 1985లో విడుదల చేసింది. ఎస్కార్ట్స్ గ్రూప్ తో కలిసి ఈ బైక్ అమ్మకాలు మొదలు పెట్టింది. 1985 నుంచి 1987 మధ్య కాలంలో సీకేడీ యూనిట్‌ గా ఈ బైకును భారత్‌ లోకి తీసుకొచ్చింది. 1996 వరకు భారత్‌ లో వీటి అమ్మకాలు కొనసాగాయి. ఆర్ఎక్స్100 బైకుకి 98.2 సీసీ, 11బీహెచ్‌పీ పీక్ పవర్‌ను, 10.45 ఎన్‌ఎం పీక్ పవర్‌ను ఉత్పత్తి చేసే టూ స్ట్రోక్ ఇంజిన్ ను కలిగి ఉండేది. నూతన ప్రమాణాలకు అనుగుణంగా ఈ బైక్ ఇంజిన్ లేకపోవడంతో 1996 తర్వాత ఉత్పత్తిని నిలిపి వేసింది.  ఆ తర్వాత యమహా నుంచి పలు మోడల్స్‌ బయటకు వచ్చినా..  ఆర్ఎక్స్100 ప్లేస్ ను రీ ప్లేస్ చేయలేకపోయాయి. ఎంతో ప్రజాదరణ పొందిన ఈ బైకు మళ్లీ మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నిస్తోంది.   


RX100 రాకపై కీలక ప్రకటన


ఇదే విషయానికి సంబంధించి  యమహా మోటార్ ఇండియా ఛైర్మన్ ఈషిన్ చిహానా కీలక విషయాలు వెల్లడించారు.  యమహా RX100 మోడల్‌ బైకునును మళ్లీ భారత మార్కెట్లోకి తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు. అయితే, పాత యమహా ఆర్‌ఎక్స్ 100 రావడం కష్టమన్నారు. ఎందుకంటే ఇది టూ -స్ట్రోక్ ఇంజిన్‌ తో రన్ అవుతుంది.  ప్రస్తుత BS6 నిబంధనలకు సరిపడదు. అందుకే ఈ బైక్ ఇంజిన్ మార్చే అవకాశం ఉందన్నారు.  ఫ్యూయల్-ఇంజెక్షన్ టెక్నాలజీతో కూడిన కొత్త ఇంజన్ రూపొందించే పనిలో ఉన్నట్లు చెప్పారు.  బైక్ డిజైన్ విషయంలోనూ పలు మార్పులు చేర్పులు జరగనున్నాయి.    


2026లో మార్కెట్లోకి వచ్చే అవకాశం!


యమహా ఏ బైక్‌పైనా RX100 అనే బ్యాడ్జ్ ను సైతం పొందే అవకాశం లేదు. సరికొత్త RX100 కోసం కంపెనీ మరో బైక్ ను రూపొందించక తప్పదు.  అందుకే పాత మోడల్‌ లోని పలు పార్టులను తొలగించి కొత్త డిజైన్ తో బైక్ రూపొందించే అవకాశం ఉంది. అయితే, ఈ పని అనుకున్నంత ఈజీ కాదని చెప్పుకోచ్చు. పరిస్థితులు ఎలా ఉన్నా 2026 వరకు మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు కంపెనీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.    


ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి యమహా


మరోవైపు భారతీయ టూ వీలర్ మార్కెట్ ప్రస్తుతం ఎలక్ట్రిక్ స్కూటర్ల చుట్టూ తిరుగుతున్నది. ఈ నేపథ్యంలో యమహా కంపెనీ సైతం ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలోకి ప్రవేశించాలని భావిస్తోంది. వీలైనంత త్వరలో భారత్ లో ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేయాలని కంపెనీ ప్రయత్నిస్తోంది.అదే సమయంలో యమహా RX100ను సైతం సరికొత్తగా వినియోగదారుల ముందుకు తీసుకురాబోతోంది. ప్రస్తుతం.. యమహా పోర్ట్‌ ఫోలియోలో 125 cc స్కూటర్లు, 150 cc స్ట్రీట్ బైకులు,  250 cc స్పోర్ట్స్ బైక్‌లు ఉన్నాయి.


Read Also: హీరో ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చెయ్యొచ్చా? లేదా?