లక్ట్రిక్ వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూసిన హీరో ఎలక్ట్రికల్ స్కూటర్ విడుదల అయ్యింది.

  హీరో మోటోకార్ప్ విడా V1 రూపంలో వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. కొత్త Vida V1 దేశంలో దశల వారీగా అందుబాటులోకి వస్తుందని కంపెనీ వెల్లడించింది. ఢిల్లీ, బెంగళూరు,  జైపూర్‌ లో తొలుత విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. స్పెసిఫికేషన్లు, అందుబాటులో ఉన్న ధర జాబితా ఆధారంగా ఈ స్కూటర్ కు సంబంధించి  లాభ, నష్టాల గురించి చర్చిద్దాం..


Hero Vida V1ని కొనుగోలు చేయడానికి 5 కారణాలు:


1. బ్యాటరీని మార్చుకోవచ్చు


మార్కెట్లోకి ఎలక్ట్రిక్ స్కూటర్లు చాలా సాధారణంగా వస్తున్నప్పటికీ, వాటిలో చాలా వరకు బ్యాటరీ మార్పిడి సాంకేతికతను కలిగి లేవు.  Vida V1  బ్యాటరీలను వేగంగా బయటకు తీయవచ్చు. ఇంట్లో మార్చుకోవచ్చు లేదంటే ఛార్జ్ చేసుకోవచ్చు.  ఇది చాలా మంది కొనుగోలుదారులను EV వైపు ఆకర్షిస్తుందని చెప్పుకోవచ్చు.


2. లుక్, స్టైలింగ్


కొత్త Vida V1 స్టైలిష్ లుక్ ను కలిగి ఉంది. డ్యూయల్ టోన్ ప్యాట్రాన్స్,  షార్ఫ్  డిజైన్ లైన్స్, మోడ్రన్ లైటింగ్ ఫ్యానెల్, లార్జ్ పెద్ద ఇన్‌స్ట్రుమెంట్ డిస్‌ప్లే కలిపి స్కూటర్ కు మంచి ఆకర్షణ అందిస్తాయి.


3. బైబ్యాక్ ఆఫర్


హీరో మోటోకార్ప్  కొత్త V1 ఎలక్ట్రిక్ స్కూటర్‌పై ప్రత్యేక బైబ్యాక్ ఆఫర్‌ను  ప్రకటించింది. వినియోగదారులు ద్విచక్ర వాహనంతో సంతృప్తి చెందకపోతే కొనుగోలు విలువలో 70% వరకు చెల్లించి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను తిరిగి కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చింది.  సుమారు 16 నుంచి 18 నెలల లోపే ఈ వాహనాన్ని వెనక్కి ఇవ్వాలనే కండీషన్ పెట్టింది.


4. మూడు రోజుల టెస్ట్ రైడ్


కొత్త V1 3 రోజుల టెస్ట్ రైడ్ కోసం కూడా అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది.  సాధారణ షోరూమ్ టెస్ట్ రైడ్‌లలో కేవలం నిమిషాల సమయం వెచ్చించడంతో పోలిస్తే, EVతో మూడు రోజులు నేరుగా గడపడం వల్ల వినియోగదారులకు మంచి స్పష్టత లభిస్తుంది.  


5. సాంకేతికత, కనెక్టివిటీ  


కొత్త Vida V1 స్మార్ట్‌ ఫోన్ కనెక్టివిటీ ఫీచర్లను దాని 7-అంగుళాల TFT స్క్రీన్‌ పై OTA సపోర్టును పొందుతుంది. ఇది  VIDA క్లౌడ్ నుంచి రూపొందించబడింది. ఇది రైడర్‌ను ఆగ్మెంటెడ్ రియాలిటీ, ప్రోగ్నోస్టిక్స్, రిమోట్ డయాగ్నస్టిక్స్ ద్వారా ఆన్ సైట్ రిపేర్ చేయడానికి, ఛార్జింగ్ స్టేషన్ స్లాట్‌ను బుక్ చేయడానికి అనుమతిస్తుంది.


Hero Vida V1ని కొనుగోలు చేయకపోవడానికి కారణాలు:


1. అధిక ధర


సాధారణంగా, హీరో మోటోకార్ప్ పెద్ద సంఖ్యలో కొనుగోలుదారులను ఆకర్షించే సరసమైన ద్విచక్ర వాహనాలను రిటైల్ చేస్తుంది.  V1 విషయంలో మాత్రం కంపెనీ కొత్త విధానాన్ని అనుసరించింది.  కొత్త V1 రెండు వేరియంట్లలో  విడుదల చేసింది.  Vida V1 Plus రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్), Vida V1 Pro  రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)ను కలిగి ఉంది. V1 దేశంలో ఉన్న అత్యంత ఖరీదైన ఎలక్ట్రిక్ స్కూటర్లలో ఒకటిగా ఉంది.


2. పరిమిత పరిధి


కొన్ని కంపెనీలు ఒకే ఛార్జ్‌పై 200 కిమీ+ పరిధిని అందిస్తున్న సమయంలో, V1 ప్రో 143 కిమీ  మాత్రమే అందిస్తుంది. హై-స్పెక్ V1 ప్రో ఒక్క ఛార్జ్‌పై కొంచెం ఎక్కువ(165 కిమీ) పరిధిని అందిస్తుంది. .


3. డిసెంబర్ డెలివరీలు


అక్టోబర్ 10న కంపెనీ బుకింగ్ మొదలు పెట్టింది.  డెలివరీలు ఈ ఏడాది డిసెంబర్ నుంచి ప్రారంభం అవుతాయి.  ఇంతకాలం వేచి ఉండే  ఓపిక వినియోగదారులకు ఉండకపోవచ్చు.