Viral Video: ఓ పాఠశాల విద్యార్థిని బ్యాగ్‌లో పాము కనిపించడంతో అక్కడున్న వారంతా హడలిపోయారు. బ్యాగ్ నుంచి పామును బయటకు తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇదీ జరిగింది
మధ్యప్రదేశ్ షాజ్‌పూర్‌లో ఈ ఘటన జరిగింది. పాఠశాలకు వెళ్లిన 10వ తరగతి విద్యార్థిని తన బ్యాగ్‌లో ఏదో మెదులుతుందని గ్రహించి.. వెంటనే ఉపాధ్యాయుడికి విషయాన్ని చెప్పింది. దీంతో అనుమానం వచ్చిన టీచర్.. ఆ స్కూల్ బ్యాగ్‌ని పూర్తిగా క్లోజ్‌చేసి స్కూల్ బయటకు తీసుకువచ్చారు.
నెమ్మదిగా జిప్ ఓపెన్ చేశారు. ఆ తర్వాత అందులో ఉన్న పుస్తకాలన్నీ బయటకు తీసేశారు. ఆ తర్వాత బ్యాగ్‌ని తలకిందులుగా చేసి దులపగానే ఒక్కసారిగా తాచుపాము బుసలు కొడుతూ బయటకు వచ్చింది. దీంతో ఒక్కసారిగా విద్యార్థులు, ఉపాధ్యాయుడు షాక్ అయ్యారు.
అయితే అదృష్టవశాత్తు ఆ పాము ఆ బ్యాగ్ నుంచి బయటపడ్డాక వారిపై దాడి చేయకుండా అక్కడ నుంచి వెళ్లిపోయింది. దీంతో త్రుటిలో పెను ప్రమాదం నుంచి వారంతా బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
షూలో
ఇటీవల ఓ చెప్పుల స్టాండులో నుంచి షూ వేసుకునేందుకు వచ్చిన మహిళకు అందులో నాగుపాము ముడుచుకొని పడుకొని ఉండటం చూసి షాక్‌కు గురైంది. వెంటనే ఓ ఇనుప రాడ్‌ను షూ లోపల నెట్టడంతో నాగుపాము పడగ విప్పి మహిళను కాటు వేసేందుకు ప్రయత్నించింది. చివరికి ఎలాగోలా ఆ పామును బయటకు పంపారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారి సుశాంత నంద షూలో పడుకున్న నాగుపాము వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. క్యాప్షన్‌లో వర్షాకాలంలో పలు ప్రదేశాలలో పాములు కనిపిస్తాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. షూలోపల నాగుపాము పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
Also Read: Rajasthan political crisis: గహ్లోత్ తీరుపై అధిష్ఠానం సీరియస్- దిల్లీకి రావాలని కమల్‌నాథ్‌కు పిలుపు!
Also Read: Russia School Shooting: పాఠశాలలో విచక్షణారహితంగా కాల్పులు- 13 మంది మృతి!