Russia School Shooting: రష్యాలో ఓ పాఠశాలలో దుండగుడు బీభత్సం సృష్టించాడు. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో 13 మంది మృతి చెందారు. మృతుల్లో ఎక్కువ మంది చిన్నారులు ఉన్నట్లు సమాచారం.







ఇదీ జరిగింది


రష్యాలోని ఇజెవ్​స్క్​లో సోమవారం ఈ ఘటన జరిగింది. 1 నుంచి 11వ తరగతి వరకు విద్యార్థులు ఉండే పాఠశాలలోకి దుండగుడు తుపాకీతో చొరబడ్డాడు. ముందుగా సెక్యూరిటీ గార్డ్‌పై కాల్పులు జరిపాడు. ఆ తర్వతా పాఠశాలలోకి వచ్చిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 20 మంది గాయపడ్డారు. 


అనంతరం తనను తాను కాల్చుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఆ పాఠశాలను చుట్టుముట్టారు. గాయపడ్డ వారిని ఆస్పత్రులకు తరలించారు. 






పడవ ప్రమాదం


సిరియాలో ఇటీవల జరిగిన ఘోర పడవ ప్రమాదంలో లెబనాన్‌కు చెందిన 86 మంది జలసమాధి అయ్యారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు కూడా ఉన్నారు. వీరంతా లెబనాన్‌ నుంచి సిరియా వెళుతున్న వలసదారులు. మృతిచెందిన వారంతా లెబనాన్‌, సిరియా దేశాలకు చెందినవారని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో పడవలో 150 మందికిపైగా ఉన్నట్లు తెలిపారు.



దాదాపు 50 మందికిపైగా గల్లంతు కాగా, 20మంది సిరియాలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. వారిలో 8 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు చెప్పారు. మెడిటెర్రేనియన్‌ తీరంలో జరిగిన అత్యంత దారుణమైన దుర్ఘటనల్లో ఇదొకటని అధికారులు చెప్పారు.


లెబనాన్‌లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా బతకు జీవుడా అంటూ అక్కడి ప్రజలు ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. లెబనాన్‌లో 90 శాతం మందికి ఉద్యోగాలు లేకపోవడం అక్కడి దారుణ పరిస్థితులకు అద్దంపడుతున్నాయి. బతకడం కన్నా సముద్రంలో పడిచావడమే మేలని పడవ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడినవారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. 


Also Read: US-Pak Relationship: 'పాక్‌తో దోస్తీ ఏ మాత్రం మంచిది కాదు'- అమెరికాకు భారత్ వార్నింగ్!


Also Read: Ghulam Nabi Azad: కొత్త పార్టీ ప్రకటించిన గులాం నబీ ఆజాద్- పేరు ఏంటంటే?.