Ghulam Nabi Azad: కాంగ్రెస్ పార్టీ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. జమ్మూలో సోమవారం తన కొత్త పార్టీని ప్రారంభించారు. 'డెమోక్రటిక్ ఆజాద్ పార్టీ'గా దానికి నామకరణం చేశారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
పార్టీకి గుడ్‌బై
73 ఏళ్ల ఆజాద్ గత నెలలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. తన సూచనలు, సలహాలను ఏళ్ల తరబడి ఏఐసీసీ మూలనపెట్టేసిందని సోనియా గాంధీకి రాసిన రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వ పటిమపై కూడా విమర్శలు చేశారు.
ఆజాద్ రాజీనామా చేసిన తర్వాత కశ్మీర్‌లో దాదాపు 1500 మంది కార్యకర్తలు కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. కశ్మీర్ ప్రజల కోసం తన పోరాటం కొనసాగిస్తానని ఆజాద్ అన్నారు.
బారాముల్లా నుంచి
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తరువాత సొంత బలాన్ని నిరూపించుకునేందుకు తన కంచుకోట లాంటి బారాముల్లాను ఆజాద్ ఎన్నుకున్నారు. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం, స్థానికులకు భూమి హక్కు, ఉపాధి హక్కు కోసం తాను కృషి చేస్తానని ఆజాద్ అన్నారు. బారాముల్లాలో ర్యాలీ తర్వాత కుప్వారా, సౌత్ కశ్మీర్‌లో ఆజాద్ వరుసగా ర్యాలీలు నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆ పార్టీపై ఆజాద్ తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
" కాంగ్రెస్ పార్టీ నాపై క్షిపణులు ప్రయోగించింది. అయితే వాటిని కేవలం రైఫిల్‌తో నాశనం చేశాను. ఒక వేళ నేను బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఉంటే వారు అదృశ్యమయ్యేవారు. పరోక్షంగా సోనియా, రాహుల్ గాంధీపై ఆజాద్ ఈ వ్యాఖ్యలు చేశారు. గురువారం జమ్ము కశ్మీర్‌లోని భదర్‌వాలో జరిగిన బహిరంగ సభలో గులాం నబీ ఆజాద్ ఇలా మాట్లాడారు. "
Also Read: Madurai Student Arrested: షాకింగ్! హాస్టల్ అమ్మాయిల నగ్న వీడియోలను బాయ్‌ఫ్రెండ్‌కు పంపిన యువతి!
Also Read: FIR Against Sadhguru: సద్గురు జగ్గీ వాసుదేవ్, అసోం సీఎం హిమంతపై కేసు- ఎందుకంటే?