పెళ్లిలో ఒక్కోసారి ఊహించని ఘటనలు చోటుచేసుకుంటాయి. వాటిలో కొన్ని గొడవలకు దారి తీస్తాయి. మరికొన్ని నవ్వులు పూయిస్తాయి. ఇంకొన్ని ఆందోళనకు గురిచేస్తాయి. అయితే, ఇప్పుడు మీరు తెలుసుకోబోయే ఘటన మాత్రం తప్పకుండా మిమల్ని నవిస్తుంది. ఆ తర్వాత ‘అయ్యో.. పాపం’ అని కూడా అనిపిస్తుంది. 


మన దేశంలో పెళ్లంటే పండుగలా జరుగుతుంది. బంధుమిత్రుల సందడి మధ్య ఎంతో ఆహ్లాదకరంగా సాగుతుంది. రెండు జీవితాలను ఒక్కటి చేసే ఆ మధుర క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే వీడియోలు, ఫొటోలు తప్పనిసరి. అందుకే ఇటీవల వెడ్డింగ్ ఫొటోలతోపాటు ప్రీ-వెడ్డింగ్, పోస్ట్-వెడ్డింగ్ ఫొటో షూట్‌లకు గిరాకీ పెరిగింది. సినిమా స్టైల్లో వీడియోలు.. ఫొటోలతో పెళ్లికి రిచ్ లుక్ ఇస్తున్నారు. 


ఇక సంపన్నుల పెళ్లిలయ్యితే ఏ విధంగా ఉంటాయో తెలిసిందే. ఫొటోగ్రాఫర్లు కూడా ఇలాంటి వారి పెళ్లిల్లను ఎంతో జాగ్రత్తగా షూట్ చేస్తారు. చిన్న పొరపాటు కూడా లేకుండా చూస్తారు. ఈ నేపథ్యం వారి దృష్టంతా వధువరులు మీదే ఉంటుంది. చెప్పాలంటే.. ఫొటోగ్రాఫర్లు తమ లోకాన్ని మరిచిపోయి.. ఆ జంట మీదే ఫోకస్ పెడతారు. ప్రతి అందమైన మూమెంట్‌ను కెమేరాలో బంధించేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నంలోనే ఓ ఫొటోగ్రాఫర్ ఊహించని ఘటనలో చిక్కుకున్నాడు. 


పెళ్లి తర్వాత వధువరులు మండపం నుంచి నడుచుకుంటూ వేదిక బయటకు వచ్చారు. వారు అలా నడుస్తూ ఉంటే.. కెమేరా మ్యాన్ వారినే షూట్ చేస్తూ వెనక్కి నడిచాడు. తన వెనుక ఉన్న స్విమ్మింగ్‌పూల్‌ను చూసుకోకుండా ఒక అడుగు వెనక్కి వేశాడు. అంతే.. కెమేరాతో సహా అతడు నీటిలో పడ్డాడు. అది చూసి వధువరులతోపాటు అక్కడ ఉన్న వారి బంధుమిత్రులు, అతిథులు షాకయ్యారు. మొదట్లో ఆ ఫొటోగ్రాఫర్‌ను చూసి ‘‘అయ్యో పాపం’’ అని అనుకున్నారు. ఆ తర్వాత నవ్వు ఆపుకోలేకపోయారు. అయితే, ఈ ఘటన కూడా వారి పెళ్లిలో మధుర క్షణంగా నిలిచిపోతుంది. వారు అలా నవ్వుతుంటే మరో కెమేరా మ్యాన్‌కు కూడా అందమైన మూమెంట్ దొరికినట్లయ్యింది. ఆ వీడియోను ఇక్కడ చూడండి. 


వీడియో: 


తాజాగా మరో పెళ్లి వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ‘విట్టీ వెడ్డింగ్’ అనే వెడ్డింగ్ ప్లానింగ్ సంస్థ ఇన్‌స్టాగ్రామ్ పేజీలో పోస్టు చేసిన ఆ వీడియోలో వరమాల కార్యక్రమంలో భాగంగా వరుడు ముందుగా మోకాలిపై కూర్చోగా.. వధువు అతడి మెడలో మాల వేసింది. ఆ తర్వాత ఆమె మోకాలిపై కూర్చోగా వరుడు మాల వేశాడు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన అతడిని చూసి.. వధువు సైతం ఎమోషనల్ అయ్యింది. వారిద్దరినీ చూసి కుటుంబ సభ్యుల కళ్లు కూడా చెమ్మగిల్లాయి. మొత్తానికి ఆ పెళ్లి.. అందరి గుండెలను బరువెక్కించింది. ఆ వీడియోను చూసేందుకు కింది లింక్‌ను క్లిక్ చేయండి. 


Watch Video: పెళ్లిలో వధూవరులు ఏడుపే ఏడుపు.. సీన్ రివర్స్, అసలు ఏం జరిగిందంటే.. 


Also Read: ‘ఫస్ట్‌ నైట్’ బెడ్‌ను రోజా పూలతోనే అలంకరించాలట.. ఎందుకో తెలుసా?


Also Read: విచిత్రం.. ఇతడికి కడుపు లేదు, పేగుల్లేవు.. అయినా బతికేస్తున్నాడు!