Viral News: రాజకీయ నాయకులకు చాలా మంది బహిరంగ లేఖలు రాస్తుంటారు. తమ ఊర్లో సమస్యల గురించి లేదా వ్యక్తిగత సాయం కోసమో ఇలా లేఖలు రాయడం సహజం. అయితే ఓ చిన్నారి ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీకి ఓ లేఖ రాసింది. ప్రస్తుతం ఆ లేఖ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇలా రాసింది
ఉత్తర్‌ప్రదేశ్ కన్నౌజ జిల్లా చిబ్రమౌ పట్టణానికి చెందిన కృతి దూబే అనే ఆరేళ్ల బాలిక ప్రధాని మోదీకి లేఖ రాసింది. పెరుగుతున్న ధరల వల్ల కలుగుతున్న కష్టం గురించి ఆ లేఖలో తెలియజేసింది. పెన్సిల్, రబ్బర్ ధరలు కూడా పెరిగాయని, మ్యాగీ రేటు కూడా విపరీతంగా పెరిగిందని ఆ లేఖలో ప్రస్తావించింది. ధరలు పెరగడం వల్ల తన తల్లి తనను కొట్టిందని లెటర్‌లో పేర్కొంది.
వైరల్
"ఇది నా చిన్నారి కూతురు మన్‌కీ బాత్ (మనసులో మాట)" అంటూ ఈ లేఖను చిన్నారి తండ్రి విశాల్ దూబే (లాయర్) సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. హిందీలో రాసిన ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ అయింది.
చిన్నారి లేఖ గురించి చిబ్రామౌ ఎస్‌డీఎం అశోక్ కుమార్ స్పందించారు. ఆ బాలికకు ఏ విధంగానైనా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఆమె లేఖను సంబంధిత అధికారులకు చేరేందుకు ప్రయత్నిస్తానన్నారు.
Also Read: BJP-JD(U): నితీశ్ కుమార్ యూటర్న్- లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసే బరిలోకి!