ABP  WhatsApp

BJP-JD(U): నితీశ్ కుమార్ యూటర్న్- లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, జేడీయూ కలిసే బరిలోకి!

ABP Desam Updated at: 01 Aug 2022 04:18 PM (IST)
Edited By: Murali Krishna

BJP-JD(U): భాజపా, జేడీ(యూ) వచ్చే లోక్‌సభ, తర్వాత బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసే పోటీ చేస్తాయని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది.

(Image Source: PTI)

NEXT PREV

BJP-JD(U): జనతాదళ్ యునైటెడ్ (జేడీయూ), భారతీయ జనతా పార్టీ (భాజపా) మధ్య విభేదాలు వచ్చినట్లు ఇప్పటికే చాలా సార్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి సమయంలో భాజపా కీలక ప్రకటన చేసింది. వచ్చే 2024 లోక్‌సభ, 2025 బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ(యూ)తో కలిసే పోటీ చేస్తామని భాజపా తేల్చిచెప్పింది. 




కార్యవర్గంలో


దిల్లీలో రెండు రోజుల పాటు జరిగిన భాజపా జాతీయ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు.



భాజపాకు జేడీ(యూ)తో ఎలాంటి విబేధాలు లేవు. పొత్తు ధర్మాన్ని పాటిస్తాం. వచ్చే ఎన్నికల్లో మేం జేడీ(యూ)తోనే కలిసి పనిచేస్తాం.                                         - అరుణ్ సింగ్, భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి
 


దూరంగా


చాలా కాలం నుంచి బిహార్ సీఎం నితీశ్ కుమార్.. ఎన్‌డీఏ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. తమ పార్టీ కేంద్రమంత్రికి రాజ్యసభ సీటు కూడా ఇవ్వలేదు. జేడీయూ పార్టీకి చెందిన ఆర్ సీపీ సింగ్‌ ప్రధాని కేబినెట్‌లో ఒకే ఒక్కడుగా ఉండేవారు. ఇటీవలి కాలంలో ఆయన నితీష్ కుమార్‌ను లెక్కలోకి తీసుకోకుండా వ్యవహరించారు. కుల ఆధారిత జన గణన విషయంలో పార్టీతో ఆయన విభేదించారు. భాజపాతో సన్నిహితంగా ఉన్నందునే నితీశ్ కుమార్ ఇలా ఝలక్ ఇచ్చినట్లు తెలిసింది.


2020 ఎన్నికల్లో వరుసగా మూడోసారి విజయం సాధించి నితీశ్ అధికారంలోకి వచ్చినా.. మిత్రపక్షం భాజపాకి ఎక్కువ సీట్లు దక్కాయి. దీంతో నితీశ్‌‌పై ఆ పార్టీ పెత్తనం చెలాయిస్తుందనే ప్రచారం సాగుతోంది. ఈ కారణంగా పలుమార్లు నితీశ్ కుమార్ అసహనానికి గురవుతున్నారు. 


Also Read: Bengal Cabinet Reshuffle: పార్థ ఎఫెక్ట్- బంగాల్ కేబినెట్‌లో కొత్త ముఖాలు- దీదీ కీలక ప్రకటన


Also Read: TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

Published at: 01 Aug 2022 03:39 PM (IST)

- - - - - - - - - Advertisement - - - - - - - - -

© Copyright@2024.ABP Network Private Limited. All rights reserved.