Bengal Cabinet Reshuffle: బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్థ చటర్జీ అరెస్ట్‌తో కేబినెట్ మొత్తాన్ని మారుస్తారనే వార్తలను ఆమె ఖండించారు. అయితే నలుగురు లేదా ఐదుగురు కొత్త వాళ్లను కేబినెట్‌లోకి తీసుకుంటున్నట్లు ప్రకటించారు.
బంగాల్ టీచర్ రిక్రూట్‌మెంట్ కుంభకోణం కేసులో మాజీ మంత్రి పార్థ చటర్జీని ఈడీ ఇటీవలే అరెస్టు చేసింది. ఆయన సన్నిహితురాలు నటి అర్పిత ముఖర్జీ నివాసాల్లో సోదాలు నిర్వహించిన అధికారులు రూ.50 కోట్ల నగదు, బంగారు ఆభరణాలను జప్తు చేశారు.
ఈ పరిణామాల అనంతరం పార్థ చటర్జీని మంత్రి పదవిని తొలగించారు దీదీ. అంతేకాకుండా పార్టీలోని అన్ని పదవుల నుంచి తప్పించారు.
Also Read: TN Governor RN Ravi: గన్ వాడేవాళ్లకు గన్‌తోనే ఆన్సర్- గవర్నర్ సంచలన వ్యాఖ్యలు
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు