సీరియల్ షూటింగ్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఓ టెక్నీషియన్‌పై నోరుజారిన నటుడిపై సిబ్బంది దాడి చేశారు. దుర్భషలాడుతూ సెట్ నుంచి వెళ్లగొట్టారు. ఈ ఘటన హైదరాబాద్‌లోనే చోటుచేసుకుంది. 


‘స్టార్ మా’లో ప్రసారమైన ‘సావిత్రమ్మగారి అబ్బాయి’ సీరియల్‌తో గుర్తింపు పొందిన కన్నడ నటుడు చందన్ కుమార్.. షూటింగ్‌‌ సిబ్బందితో గొడవపడ్డాడు. దీంతో ఆ సీరియల్ టెక్నీషియన్స్ అంతా అతడిపై తిరగబడ్డారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. వీడియో ప్రకారం.. ఈ గొడవలో ఓ టెక్నీషియన్ ఆగ్రహంతో చందన్ కుమార్ చెంప చెల్లుమనించడం కనిపించింది. తన తల్లిని దూషించాడంటూ ఆ టెక్నీషియన్ కోపంతో ఊగిపోవడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. 


యూనిట్ మొత్తం చందన్ కుమార్‌పై తిరగబడటమే కాకుండా.. ‘‘నువ్వేమైనా మెగాస్టార్‌వా?’’ అంటూ అతడిని బూతులు తిట్టడం వీడియోలో కనిపించింది. అనంతరం ఆ టెక్నీషియన్‌కు చందన్ కుమార్‌తో క్షమాపణలు చెప్పించారు. చందన్ కుమార్ ప్రస్తుతం ‘శ్రీమతి శ్రీనివాస్’ సీరియల్‌లో హీరో పాత్రను పోషిస్తున్నాడు. చందన్ కుమార్ సినిమాలో హీరోగా కూడా నటించాడు. యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యతో కలిసి ‘బరహా’ సినిమాలో నటించాడు. తెలుగుతోపాటు కన్నడ సీరియల్స్‌లో కూడా చందన్ కుమార్ నటిస్తున్నాడు. అయితే, చందన్ కుమార్‌పై దాడికి కారణం ఏమిటనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇదివరకు కూడా చందన్ కుమార్ షూటింగ్ సిబ్బందిపై నోరు జారాడని, ఇది రెండోసారని టెక్నీషియన్స్ ఆరోపించారు. 


Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు


Also Read : బాయ్‌కాట్ 'లాల్ సింగ్ చ‌డ్డా' - ఖాన్స్ సినిమాపై నెటిజన్స్ ఫైర్


వీడియో: