Tollywood Breaking News : ఆగస్టు 1 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో బంద్ జరగనుంది. రేపటి నుంచి సినిమా షూటింగులు ఏవీ చేయకూడదని టాలీవుడ్ డిసైడ్ అయ్యింది. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికైన వెంటనే ఈ నిర్ణయం గురించి ప్రకటించారు.


సినిమా నిర్మాణ వ్యయం పెరగడం, పరాజయాలు ఎక్కువ కావడంతో నష్టనివారణ చర్యలు తీసుకోవాలని కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ తరపున 'దిల్' రాజు, మరి కొంత మంది నిర్మాతలు చర్చలు సాగిస్తున్నారు. హీరోల పారితోషికం అంశంతో పాటు  అయితే... గిల్డ్ నిర్ణయాలతో తమకు సంబంధం లేదన్నట్లు కొంత మంది చెప్పుకొచ్చారు. కానీ, చివరకు అందరూ ఒక్కతాటి మీదకు వచ్చారు.
 
సమస్యలకు పరిష్కారం దొరికేంత వరకు బంద్ : ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు
ఆదివారం తెలుగు సినిమా ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు జరిగాయి. అందులో తాజా మాజీ అధ్యక్షుడు కొల్లి రామకృష్ణ, బసిరెడ్డి పోటీ పడ్డారు. మొత్తం 50 మంది ఈసీ సభ్యులు ఉండగా... 48 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. బసిరెడ్డికి 22 ఓట్లు రాగా... కొల్లి రామకృష్ణకు 20 ఓట్లు వచ్చాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడిగా బసిరెడ్డి ఎన్నికైన వెంటనే తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. అందులో షూటింగ్ బంద్ చేయాలన్న నిర్ణయానికి మద్దతు లభించింది. 


''రేపటి నుంచి సినిమా షూటింగులు బంద్ చేయాలనుకున్నాం. చిత్ర పరిశ్రమలోని 24 శాఖల వారికీ సమస్యలు ఉన్నాయి. అందరికీ న్యాయం చేయాలని మేం ప్రయత్నాలు చేస్తున్నాం. అందుకోసం షూటింగులు బంద్ చేయాలనే నిర్ణయం తీసుకున్నాం. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న సినిమా షూటింగులు ఏవీ రేపటి నుంచి జరగవు. జనరల్ బాడీ మీటింగ్ లో తీసుకున్న కీలక నిర్ణయం ఇది'' అని బసిరెడ్డి తెలిపారు.


Also Read : నాలుగు ఎముకలు దొరికితే చాలు, డెడ్ బాడీ జాతకం చెబుతానంటున్న అమలా పాల్


మేమంతా కూర్చుని మాట్లాడుకుంటాం : 'దిల్' రాజు
ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ 'దిల్' రాజు సైతం షూటింగ్ బంద్ చేయాలన్న నిర్ణయం గురించి చెప్పారు. జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయం గురించి మళ్ళీ కూర్చుని మాట్లాడుకుంటామని ఆయన పేర్కొన్నారు.


Also Read : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు