Kavya Kalyanram As Heroine : తెలుగు తెరపైకి మరో కొత్త కథానాయిక వస్తున్నారు. ఆమె పేరు కావ్యా కళ్యాణ్ రామ్. పేరు ఎక్కడో విన్నట్లు ఉందా? 'గంగోత్రి' టైటిల్ కార్డ్స్‌లో చూసి ఉంటారు. అందులో బాలనటిగా చేశారు. ఇప్పుడు కథానాయికగా తొలి అడుగులు వేస్తున్నారు. ఆల్రెడీ బాలనటిగా అనుభవం ఉండటంతో ఈజీగా నటించేశారట. 


Masooda Movie : కావ్యా కళ్యాణ్ రామ్ కథానాయికగా పరిచయం అవుతున్న చిత్రం 'మసూద6'. 'మ‌ళ్లీ రావా', 'ఏజెంట్ సాయిశ్రీ‌నివాస ఆత్రేయ' వంటి విజయవంతమైన చిత్రాలు నిర్మించిన స్వధ‌ర్మ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ సంస్థలో రూపొందుతోన్న మూడో చిత్రమిది. రాహుల్ యాదవ్ నక్కా నిర్మిస్తున్నారు. 'జార్జ్ రెడ్డి'లో లలన్ సింగ్ పాత్రలో నటించడంతో పాటు 'ఆహా' వెబ్ సిరీస్ 'సిన్'లో హీరోగా నటించారు తిరువీర్ ఉన్నారు కదా! ఆయన ఈ సినిమాలో హీరో.   


ఆగస్టు 2న 'మసూద' టీజర్ 
'మసూద' సినిమా టీజర్‌ను ఆగస్టు 2న విడుదల చేయనున్నట్లు నిర్మాత రాహుల్ యాదవ్ నక్కా తెలిపారు. ఇదొక హారర్ డ్రామా జానర్ సినిమా. 'మళ్ళీ రావా'తో గౌతమ్ తిన్ననూరిని, 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'తో స్వరూప్‌ను తెలుగు చలన చిత్ర పరిశ్రమకు దర్శకులుగా పరిచయం చేసిన రాహుల్ యాదవ్ నక్కా.. . ఈ సినిమాతో సాయికిరణ్ అనే యువకుడిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.


Also Read : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు


నటి సంగీత 'మసూద'లో కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. 'శుభలేఖ' సుధాకర్, అఖిల రామ్, బాంధవి శ్రీధర్, 'సత్యం' రాజేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ ఆర్. విహారి సంగీతం అందిస్తున్నారు.


Also Read : పిస్టల్ షూటింగ్లో అదరగొట్టిన స్టార్ హీరో, నాలుగు బంగారు పతకాలు సొంతం