వెండితెరపై అమలా పాల్ (Amala Paul) కనిపించి మూడేళ్ళు అవుతోంది. 'ఆడై' (తెలుగులో 'ఆమె' పేరుతో విడుదల అయ్యింది) సినిమా తర్వాత ఆమె నటించిన సినిమా ఏదీ థియేటర్లలో విడుదల కాలేదు. 'ఆమె' తర్వాత మరో  సినిమాతో థియేటర్లలోకి రాలేదు కానీ... 'కుట్టి స్టోరీ', 'పిట్ట కథలు' - రెండు యాంథాలజీ ఫిలిమ్స్‌తో ఓటీటీ ద్వారా ప్రేక్షకులను ముందుకు వచ్చారు. ఇప్పుడు మరోసారి ఓటీటీలోకి వస్తున్నారు. అయితే, ఈసారి సినిమాతో వస్తున్నారు. 


నిర్మాతగా అమలా పాల్
అమలా పాల్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'కడవర్' (Cadaver Telugu Movie). ఇదొక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. అనూప్ ఎస్ పానికర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా స్పెషాలిటీ ఏంటంటే... దీనికి అమలా పాల్ నిర్మాత. దీంతో ఆమె నిర్మాణంలోకి అడుగు పెట్టారు. 


Amala Paul Pathologist In Cadaver Movie : 'కడవర్' సినిమాలో అమలా పాల్ పాథాలజిస్ట్ / పోలీస్ సర్జన్ రోల్ చేశారు. అంటే.... మరణించిన వ్యక్తుల శరీరాలపై పరిశోధనలు చేసే డాక్టర్ అన్నమాట. బాడీని ఎగ్జామిన్ చేసి మరణానికి గల కారణాలు కనిపెడతారు. 'కడవర్' ట్రైలర్ చూస్తే... ఒక అమ్మాయి మిస్సింగ్ అని పోలీసులకు కంప్లైంట్ వస్తుంది. రెండు రోజుల తర్వాత ఆ అమ్మాయి డెడ్ బాడీ దొరుకుతుంది. అమలా పాల్ పరిశోధనలో అమ్మాయిని గ్యాంగ్ రేప్ చేసి మర్డర్ చేశారని తెలుస్తుంది. గ్యాంగ్ రేప్ చేసింది ఎవరు? ఎందుకు హత్య చేశారు? ఆస్తి కోసం సొంత తమ్ముడిని చంపింది ఎవరు? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి. 


Also Read : 'జబర్దస్త్'కు ఎక్స్ట్రా గ్లామర్, అనసూయ ప్లేస్‌లో వచ్చిన కొత్త యాంకర్ ఎవరో తెలుసా?



'ఏంజిల్ ఎముకలు నాలుగు దొరికితే చాలు... దాంతో తన జాతకం ఏంటో తెలుసుకోవచ్చు' అని అమలా పాల్ చెప్పే డైలాగ్ ఆమె క్యారెక్టరైజేషన్ గురించి చెబుతుంది. ఆగస్టు 12న డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఓటీటీ వేదికలో 'కడవర్' విడుదల కానుంది. ఈ సినిమాను తమిళ, తెలుగు భాషల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. నిజం చెప్పాలంటే... తమిళంలో తీసిన సినిమాను తెలుగులో డబ్బింగ్ చేశారు. రీసెంట్‌గా ట్రైలర్ విడుదల చేశారు. 


Also Read : హిందూ మతం నాకు తల్లితో సమానం - క్షమాపణలు కోరిన 'కమిట్‌మెంట్' దర్శకుడు