మెగా డాటర్ నిహారిక (Niharika Konidela) కేవలం నటి మాత్రమే కాదు, నిర్మాత కూడా! పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ స్టార్ట్ చేసి... డిఫరెంట్ వెబ్ సిరీస్‌లు నిర్మిస్తున్నారు. లేటెస్టుగా నిహారిక కొణిదెల నిర్మించిన వెబ్ సిరీస్ 'హలో వరల్డ్'.


ఆర్యన్ రాజేష్ (Aryan Rajesh), సదా (Sadaa) కీలక పాత్రల్లో 'హలో వరల్డ్' వెబ్ సిరీస్‌ రూపొందింది. ఇందులో 'దేవుళ్ళు' ఫేమ్ నిత్యా శెట్టి, ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ విజయేంద్ర సింహ, 'మై విలేజ్ షో' గీలా అనిల్, రామ్ నితిన్, నయన్ కరిష్మా, సుదర్శన్ గోవింద్, స్నేహాల్ ఎస్. కామత్, రవి వర్మ, జయ ప్రకాష్‌ ఇతర ప్రధాన తారాగణం.
 
'హాలో వరల్డ్' వెబ్ సిరీస్ (Hello World Web Series) లో మెయిన్ క్యారెక్టర్లను ఈ రోజు పరిచయం చేశారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్ టీజర్‌ను సాయి తేజ్ విడుదల చేశారు. ఆర్యన్ రాజేష్ లెర్నింగ్ ఆఫీసర్ రోల్ చేయగా... నిఖిల్ విజయేంద్ర సింహ, మరొకరు ఐటీ కపుల్ రోల్స్ చేశారు. కొత్తగా సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వచ్చిన కొత్త మంది జీవితాల్లో ఏం జరిగిందనేది వెబ్ సిరీస్ కాన్సెప్ట్.


Also Read : 'బింబిసార' ప్రీ రిలీజ్‌లో అపశృతి - నందమూరి అభిమాని మృతి


ఆగస్టు 12న 'జీ 5' ఓటీటీ వేదికలో 'హలో వరల్డ్' వెబ్ సిరీస్ విడుదల కానుంది. ఈ సిరీస్‌కు శివసాయి వర్థన్ జలదంకి దర్శకత్వం వహించగా... పీకే దండి సంగీతం అందించారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' తర్వాత జీ 5 కోసం నిహారిక నిర్మించిన ఎక్స్‌క్లూజివ్‌ వెబ్ సిరీస్ ఇది. 


Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు