సినిమా వేడుకలకు హాజరైన అభిమానులు, ప్రేక్షకుల క్షేమంగా ఇంటికి చేరాలని ప్రతి కథానాయకుడు, చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. జాగ్రత్తలు చెబుతారు. ఈ విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎప్పుడూ ఒక అడుగు ముందు ఉంటారు.


రోడ్డు ప్రమాదంలో ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ, పెద్దన్నయ్య జానకి రామ్ మరణించిన విషయం విదితమే. అందుకని, ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తరచూ ఎన్టీఆర్ చెబుతుంటారు. ప్రతి వేడుకలో అభిమానులు, ప్రేక్షకులకు జాగ్రత్త చెబుతారు. ప్రతి సినిమా ముందు ఆయన వాయిస్ బైట్ ఒకటి వినబడుతుంది.


ఆస్తిపాస్తులు వద్దు... అభిమానులు చాలు : ఎన్టీఆర్ 
'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానుల గురించి మాట్లాడారు. ''ఇది వర్షాకాలం. కంగారు పడకండి. జాగ్రత్తగా... జాగ్రత్తగా... జాగ్రత్తగా... మీరందరూ ఇళ్లకు చేరాలి. మీ కోసం మీ తల్లిదండ్రులు, పిల్లాపాపలు, భార్యలు ఎదురు చూస్తుంటారు. ఒక్కసారి గుర్తు పెట్టుకుని దయచేసి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి. నాకంటూ, కళ్యాణ్ అన్నకంటూ ఆస్తిపాస్తులు వద్దు. మీరందరూ చాలు. మా తాత గారు, మా నాన్నగారు మాకు వదిలి వెళ్లిన అభిమానులు మీరు జీవితాంతం.... ఎల్లప్పుడూ మీకు రుణపడి ఉంటాం'' అని ఎన్టీఆర్ జాగ్రత్త చెప్పారు. జై ఎన్టీఆర్, జోహార్ హరికృష్ణ అంటూ స్పీచ్ ముగించారు.


Also Read : ఫ్యాట్ టు ఫిట్, 88 నుంచి 75 కేజీల వరకూ - నందమూరి కళ్యాణ్ రామ్ కష్టం అంతా ఇంతా కాదు
 
నందమూరి అభిమాని మృతి
అభిమానుల కోసం పలు జాగ్రత్తలు తీసుకున్నా, అందరూ జాగ్రత్తగా ఉండాలని చెప్పినప్పటికీ... 'బింబిసార' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఒక అపశృతి చోటు చేసుకుందని ఫిల్మ్ నగర్ వర్గాల నుంచి తెలుస్తోంది. సాయిరామ్ అనే ఎన్టీఆర్ అభిమాని ఒకరు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. అభిమాని మరణానికి గల కారణాలు తెలియలేదు. ఈ ఘటన పోలీస్ స్టేషన్ వరకూ వెళ్ళిందని, పోలీసులు విచారణ చేస్తున్నారని సమాచారం.  


నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మించిన 'బింబిసార' ద్వారా వ‌శిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఆల్రెడీ సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు. వాటికి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్, వరీనా హుస్సేన్ హీరోయిన్లు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.


Also Read : థియేటర్లకు జనాలు రావడం లేదంటే నమ్మను, ఇండస్ట్రీకి ఇది గడ్డు కాలం కాదు - ఎన్టీఆర్