Laal Singh Chaddha on Twitter: బాయ్‌కాట్ 'లాల్ సింగ్ చ‌డ్డా' - ఖాన్స్ సినిమాపై నెటిజన్స్ ఫైర్

ఆమిర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించిన లేటెస్ట్ సినిమా 'లాల్ సింగ్ చడ్డా'ను బాయ్ కాట్ చేయమని నెటిజన్లు పిలుపు ఇస్తున్నారు. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతోంది.

Continues below advertisement

ఆమిర్ ఖాన్ (Aamir Khan), కరీనా కపూర్ ఖాన్ (Kareena Kapoor Khan) జంటగా నటించిన తాజా సినిమా 'లాల్ సింగ్ చడ్డా'. టాలీవుడ్ స్టార్ అక్కినేని నాగ చైతన్య హిందీ చలన చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్న చిత్రమిది. ఇప్పుడీ సినిమా ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతోంది. అదీ రాంగ్ రీజన్స్‌తో!

Continues below advertisement

మేలోనూ బాయ్ కాట్ చేయమంటూ...
'లాల్ సింగ్ చడ్డా'ను బాయ్ కాట్ చేయమని నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. ఇప్పుడు 'బాయ్ కాట్ లాల్ సింగ్ చడ్డా' హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్ర్ అవుతోంది. ఆమిర్ సినిమాపై ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేయడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ఏడాది మే నెలలోనూ బాయ్ కాట్ చేయమంటూ ట్రెండ్ చేశారు. ట్రైలర్ విడుదలైన తర్వాత ఫైర్ అయ్యారు.

ఆమిర్ సినిమాపై ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఈ ఆగ్రహ జ్వాలలు?
ఆగస్టు 11న 'లాల్ సింగ్ చడ్డా' ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో మరోసారి సినిమాను బాయ్ కాట్ చేయమంటూ నెటిజన్స్ కొందరు పిలుపు ఇస్తున్నారు. నిజం చెప్పాలంటే... ఇప్పుడు ఆమిర్ ఖాన్ కొత్తగా ఏమీ మాట్లాడలేదు. కానీ, గతంలో దేశంలో అసహనం పెరుగుతోందంటూ వ్యాఖ్యలు చేశారు. తన మాజీ భార్య కిరణ్ రావ్, పిల్లలు దేశం విడిచి వెళ్లాలని అనుకుంటున్నట్లు... ఇండియా సేఫ్ కాదని భావిస్తున్నట్లు చెప్పారు. అప్పట్లో ఆయన మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం అయ్యింది. మరోసారి ఆ మాటలను గుర్తు చేస్తున్నారు నెటిజన్లు.

కరీనా కపూర్ ఖాన్ సైతం గతంలో ఒకసారి 'మా సినిమాలను చూడమని ఎవరూ ఫోర్స్ చేయడం లేదు' అని కామెంట్ చేశారు. వాటినీ ఇప్పుడు బయటకు తీశారు.

Also Read : హాట్‌స్టార్‌లో 'ది వారియర్', ఆహాలో 'పక్కా కమర్షియల్', జీ తెలుగులో 'కెజియఫ్ 2' - విడుదల ఎప్పుడంటే?

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వారసులుగా సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టి స్టార్స్ అయిన వారిపై సోషల్ మీడియాలో చాలా మంది ఫైర్ అవుతున్నారు. అలాగే, ఇండియాకు వ్యతిరేకంగా మాట్లాడిన వ్యక్తుల మీద కూడా! ఈ ఆగ్రహ జ్వాలల నుంచి 'లాల్ సింగ్ చడ్డా' ఎలా తప్పించుకుంటుందో?

Also Read : ఆగస్టు 1 నుంచి తెలుగు సినిమా షూటింగులు బంద్ - నిర్ణయం ప్రకటించిన చాంబర్, 'దిల్' రాజు

Continues below advertisement