TN Governor RN Ravi: తుపాకీ వాడే వారికి తుపాకీతోనే సమాధానం చెప్పాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి. కేరళ కొచ్చిలో జరిగిన ఓ కార్యక్రమంలో అంతర్గత భద్రతకు సమకాలీన సవాళ్లు అనే అంశంపై ఆయన మాట్లాడారు.
ప్రజలు సహకరించడం వల్లే ఉగ్రవాద నిర్మూలన సాధ్యం అవుతోంది. హింస పట్ల జీరో టాలరెన్స్ ఉంది. ఎవరైనా గన్ వాడితే వాళ్లకు ఆ గన్‌తోనే సమాధానం ఇవ్వాలి. దేశ ఐక్యత, సమగ్రతకు వ్యతిరేకంగా మాట్లాడేవారితో చర్చలు ఉండవు. గడిచిన 8 ఏళ్లలో ఎటువంటి సాయుధ గ్రూపుతో చర్చలు నిర్వహించ లేదు. - ఆర్ ఎన్ రవి, తమిళనాడు గవర్నర్
మన్మోహన్‌పై
మాజీ ప్రధాని మన్మోహన్ తీరును కూడా గవర్నర్ ఖండించారు. 2008లో ముంబయి ఉగ్రదాడులు జరిగిన తర్వాత పాకిస్థాన్‌తో భారత్ కుదుర్చుకున్న ఉగ్రవాద ఒప్పందాన్ని ఆయన తప్పుపట్టారు.
ఆ ఉగ్రదాడితో దేశం విషాదంలో నిండిపోయింది. కానీ 9 నెలలు గడవకముందే ఉగ్రవాద బాధితులమని రెండు దేశాల ప్రధానులు సంతకాలు చేశారు. పాకిస్థాన్ మనకు మిత్ర దేశమా లేక శత్రు దేశమా, ఈ అంశంలో క్లారిటీ ఉండాలి, కన్ఫ్యూజన్ ఉండకూడదు. కానీ పుల్వామా దాడి తర్వాత పాక్‌లోని బాలాకోట్‌పై జరిగిన సర్జికల్ దాడిని మీరు చూశారు. ఎవరైనా ఉగ్రవాద చర్యకు పాల్పడితే వాళ్లు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. మన్మోహన్ పాలనతో పోలిస్తే ఇప్పుడు అంతర్గత భద్రత మెరుగ్గా ఉంది. - ఆర్ ఎన్ రవి, తమిళనాడు గవర్నర్
Also Read: Salman Khan: సల్మాన్ ఖాన్‌కు తుపాకీ లైసెన్స్- భద్రత పెంచిన ముంబయి పోలీసులు
Also Read: Sena's Sanjay Raut Arrested: ఆ చట్టం కిందే సంజయ్ రౌత్ అరెస్ట్- కస్టడీ కోరనున్న ఈడీ