Salman Khan: బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ (Salman Khan) కు తుపాకీ లైసెన్స్ (license) ఇచ్చారు ముంబయి పోలీసులు (Mumbai Police). సల్మాన్ ఖాన్‌ను చంపేస్తామని గ్యాంగస్టర్ లారెన్స్ బిష్ణోయ్ బెదిరించిన కారణంగా ఆయనకు తుపాకీ లైసెన్సును మంజూరు చేస్తూ ముంబయి పోలీసు కమిషనర్ వివేక్ ఫన్ సల్కార్ నిర్ణయం తీసుకున్నారు.
భద్రత పెంపు
బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపుల కారణంగా హీరో సల్మాన్ ఖాన్‌కు ముంబయి పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జూన్ 6 నుంచి సల్మాన్ ఇంటి వద్ద సాయుధ పోలీసులతో కూడిన వ్యాన్‌ను ఉంచారు. ఇటీవల తెలుగు సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్ నగరంలోని పార్క్ హయత్ హోటల్‌లో బస చేయడంతో అక్కడ కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ప్రైవేటు వ్యక్తుల బందోబస్తును ఏర్పాటు చేశారు. హోటల్ లో ఒక ఫ్లోరును ఆయనకు కేటాయించారు. షూటింగు కోసం హైదరాబాద్ నగరంలో తిరిగినపుడు సల్మాన్ కారుకు ముందూ వెనుకా ఎస్కార్టు కార్లు ఏర్పాటు చేశారు. ముంబయి నగరంలోనూ సల్మాన్‌కు రక్షణ ఏర్పాట్లు చేశారు. బుల్లెట్ ఫ్రూఫ్ కారును ఇచ్చారు.
బిష్ణోయ్ వార్నింగ్
పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలాకు పట్టిన గతే సల్మాన్ ఖాన్‌కు పడుతుందని లారెన్స్ బిష్ణోయ్ ఇటీవల బెదిరించారు. ఈ మేరకు బిష్ణోయ్ రాసిన లేఖ సల్మాన్ ఖాన్ తండ్రి సలీంఖాన్‌కు వచ్చింది. బెదిరింపు లేఖ కారణంగా సల్మాన్ తనకు తుపాకీ లైసెన్సు జారీ చేయాలని పెట్టిన వినతి మేరకు పోలీసులు అనుమతి ఇచ్చారు.
Also Read: Sena's Sanjay Raut Arrested: ఆ చట్టం కిందే సంజయ్ రౌత్ అరెస్ట్- కస్టడీ కోరనున్న ఈడీ
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 39 మంది మృతి