Sena's Sanjay Raut Arrested: పత్రా చాల్ భూ కుంభకోణం కేసులో శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. దక్షిణ ముంబయిలోని ఈడీ జోనల్ ఆఫీసులో దాదాపు 6 గంటల పాటు రౌత్‌ను ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
సోమవారం అర్ధరాత్రి 12.05 నిమిషాలకు మనీ లాండరింగ్ చట్టం (PMLA) ప్రకారం సంజయ్ రౌత్‌ను ఈడీ అదుపులోకి తీసుకున్నట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది. పత్రా చాల్ కేసులో దర్యాప్తునకు రౌత్ సహకరించకపోవడంతో ఈడీ ఈ నిర్ణయం తీసుకుంది.
కోర్టులో
సంజయ్ రౌత్‌ను పీఎమ్‌ఎల్‌ఏ కోర్టులో సోమవారం హాజరు పరచనున్నారు. ఆయన్ను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది.
సోదాలు
ఆదివారం ఉదయం 7 గంటలకు ఈడీ అధికారుల బృందం సీఐఎస్ఎఫ్ సిబ్బందితో కలిసి ముంబయి బందూప్‌లో ఉన్న సంజయ్ నివాసానికి చేరుకున్నారు. ముంబయిలోని ఓ భవనం అభివృద్ధి, దానికి సంబంధించిన లావాదేవీలు, ఆయన సతీమణి, సన్నిహితుల లావాదేవీలపై అధికారులు ప్రశ్నించారు. ఆయన నివాసంలో దొరికిన రూ.11.5 లక్షలను సీజ్ చేశారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 16 వేల కరోనా కేసులు- 39 మంది మృతి
Also Read: IT Returns 2022: చివరి రోజు ఐటీ రిటర్నుల వెల్లువ, ITR ఫైల్ ల్ చేయని వారికి జరిమానా !