హైదరాబాద్‌లో ఓ కాంగ్రెస్ నేత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఫిరోజ్ ఖాన్ కుమార్తె తానియా రోడ్డు ప్రమాదంలో చనిపోయింది. శంషాబాద్‌లో ఆదివారం రాత్రి ఆమె ఓ పార్టీకి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కారులో తానియాతో పాటు ఉన్న మరో ఇద్దరు స్నేహితులకు కూడా తీవ్ర గాయాలు అయ్యాయి. వారిని చికిత్స కోసం, ఆసుపత్రికి తరలించారు. శంషాబాద్ నుంచి వస్తుండగా అదుపు తప్పి కారు బోల్తా కొట్టింది. తానియా మృతదేహాన్ని పోలీసులు ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేతగా ఉన్నారు. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కుమార్తె తానియా బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Feroz Khan Daughter: శంషాబాద్‌లో కారు బోల్తా, కాంగ్రెస్ ప్రముఖ లీడర్ కూతురు దుర్మరణం
ABP Desam
Updated at:
01 Aug 2022 08:40 AM (IST)
ఫిరోజ్ ఖాన్ టీపీసీసీ మైనార్టీ విభాగానికి చెందిన ముఖ్య నేతగా ఉన్నారు. నాంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌ఛార్జ్ గా ఉన్నారు. ఆయన కుమార్తె తానియా బ్యూటీషియన్ గా పని చేస్తున్నారు.
ప్రమాదానికి గురైన కారు