అదనపు కట్నం కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. కట్నాలకి ఆశపడే భర్తలు కట్టుకున్న భార్యలను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇటీవలే గచ్చిబౌలిలో ఓ ఘటన జరిగింది. బ్యాంకులో అసిస్టెంట్ మేనేజరు స్థాయిలో ఉన్నత ఉద్యోగంలో ఉండి కూడా అతను అదనపు కట్నం కోసం ఆశపడ్డాడు. కారు కొనుక్కొనేందుకు రూ.10 లక్షలు పుట్టింటి నుంచి తేవాలంటూ భార్యను విపరీతంగా వేధించడంతో గతి లేని పరిస్థితుల్లో ఆమె ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా శంషాబాద్ పరిసర ప్రాంతంలో ఓ భర్త అదనపు కట్నం కోసం మరీ పశువులా ప్రవర్తించాడు. కట్టుకున్న భార్యను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండగా, కట్నంపైనే మోజుతో భార్యను పరుల పక్కలోకి చేర్చుతానని బెదిరించిన ఘటన హైదరాబాద్ శివారులో చోటు చేసుకుంది.


హైదరాబాద్ శివారులోని శంషాబాద్ పరిధిలో ఈ అమానవీయ ఘటన జరిగింది. శంషాబాద్‌ పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. పెళ్లి జరిగిన కొన్నాళ్లకే ఆమెకు తోడు ఉండాల్సింది పోయి, గుదిబండగా మారాడు. రోజూ తీవ్ర మానసిక వేదనని మిగిల్చుతున్నాడు. ఇటీవల కొంత కాలంగా ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరగడం మొదలు పెట్టాడు. ఖర్చులకు డబ్బు లేక భార్యను అదనపు కట్నం కోసం వేధించడం ప్రారంభించాడు. అనుకున్నది జరక్కపోయే సరికి.. పడక గదిలో భార్య నగ్న చిత్రాలను తన సెల్ ఫోన్ లో తీశాడు. ఇదంతా ఆమెకు తెలియకుండానే రికార్డు చేశాడు. వాటిని ఫోన్ లోనే స్నేహితుడికి పంపించాడు.


Also Read: ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్ - విదేశాల్లో కేసినోలు, హవాలా మనీపై ప్రశ్నల వర్షం !


ఆ విషయం తెలుసుకున్న భార్య, భర్తను నిలదీయగా తన స్నేహితుడితో పడుకోవాలని ఒత్తిడి చేశాడు. ఆ వేదన భరించలేక ఆమె శంషాబాద్‌ పోలీసులను ఆశ్రయించింది. దీంతో పోలీసులు భర్త, అత్తమామలతో పాటు మరో ముగ్గురిపై ఆదివారం కేసు నమోదు చేశారు. శంషాబాద్‌కు చెందిన 35 ఏళ్ల ఓ వ్యాపారి 2016లో మహిళ ను పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి టైంలో రూ.5 లక్షల నగదు, 9 తులాల బంగారు ఆభరణాలు, లక్షల విలువైన ఇతర ఇంటి సామాన్లు పుట్టింటివారు ఇచ్చారు జరిగిన ఘోరాన్ని అత్త, మామల దృష్టికి తీసుకెళ్లగా కుమారుడు చేసిన నిర్వాకాన్ని సమర్థించి ఇంకా కట్నం తేవాలని హెచ్చరించినట్లుగా పోలీసులు తెలిపారు. అందుకే వారిపై కూడా కేసు పెట్టినట్లు చెప్పారు.


Also Read: Chikoti Casino Case : కేసినో కేసులో ఏడుగురికి ఈడీ నోటీసులు - పట్టించేసిన రూ. కోట్ల లావాదేవీలు !