సంజయ్‌ రౌత్‌ను చూసి గర్వపడుతున్నాను. పుష్ప సినిమాలో 'ఝూకేంగా నహీ' (తగ్గేదేలే) అని ఓ డైలాగ్ ఉంటుంది. అయితే వెనక్కి తగ్గని నిజమైన శివసైనికుడు సంజయ్ రౌత్. భాజపా ప్రలోభాలకు లొంగను అని చెప్పిన చాలా మంది ఇప్పుడు వారి వర్గంలో చేరారు. ఇది కాదు బాలాసాహెబ్ ఠాక్రే చెప్పింది. రౌత్ నిజమైన శివ సైనికుడు.  రౌత్‌ను అరెస్ట్ చేసి భాజపా విర్రవీగుతోంది. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. భవిష్యత్తులో రెట్టింపు ప్రతీకారం తీర్చుకుంటాం.                                                   - ఉద్ధవ్ ఠాక్రే, శివసేన అధినేత