Vladimir Putin Judo Video:


జపాన్‌ పర్యటనలో..


ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన దేశాల జాబితాలో రష్యాకూ స్థానం ఉంది. ఆ దేశ అధ్యక్షుడికి అంతర్జాతీయంగా పాపులారిటీ ఉంది. ఉక్రెయిన్‌పై సైనిక చర్య మొదలు పెట్టినప్పటి నుంచి ఆయన పేరే అంతటా వినిపిస్తోంది. దాదాపు 200 రోజులుగా ఈ యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎవరు ఏం చెప్పినా...పుతిన్ వెనక్కి తగ్గకుండా ఉక్రెయిన్‌పై బల ప్రయోగం సాగిస్తూనే ఉన్నారు. ఎత్తిన కత్తిని దించకూడదు అనేది పుతిన్ ఫిలాసఫీ. కేవలం రాజకీయాల్లోనే కాదు. ఇంకా చాలా రంగాల్లో ఆయనకు నైపుణ్యం ఉంది. జూడో కరాటే అంటే పుతిన్‌కు చాలా ఇష్టం. ఈ యుద్ధ క్రీడలో ఆయన బ్లాక్‌బెల్ట్ కూడా సాధించారు. అయితే...ఇప్పుడు పుతిన్‌కు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. జూడో ఆడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అంతలా వైరల్ అవడానికి కారణం...బ్లాక్‌బెల్ట్‌ సాధించిన పుతిన్‌ను ఓ బాలిక ఓడించడమే. 2000 సంవత్సరంలో పుతిన్ జపాన్‌ పర్యటనకు వెళ్లారు. ఖాళీ సమయంలో తనకు ఎంతో ఇష్టమైన జూడో ఆట ఆడేందుకు రంగంలోకి దిగారు. ఆయనతో ఓ 9 ఏళ్ల బాలిక తలపడింది. ఒకే ఒక్క క్షణంలో పుతిన్‌ను అమాంతం భుజంపై ఎత్తి కింద పడేసింది. చుట్టూ ఉన్న వాళ్లంతా ఇది చూసి ఆశ్చర్యపోయారు. చప్పట్లు కొట్టారు. పుతిన్ కూడా వెంటనే లేచి ఆ బాలికకు అభివాదం చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. అంత చిన్న పిల్ల పుతిన్‌ను ఎలా ఎత్తి పడేసిందో అంటూ కామెంట్ చేస్తున్నారు. 






ఫిట్‌నెస్‌పై శ్రద్ధ..


పుతిన్‌కు ఫిట్‌నెస్‌పై ఎంతో శ్రద్ధ. రోజువారీ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ తప్పకుండా జిమ్‌లో గంటల తరబడి వర్కౌట్‌లు చేస్తారు. 11 ఏళ్ల వయసులోనే జూడో ప్రాక్టీస్‌ను మొదలు పెట్టారు. ఆ తరవాత 14 ఏళ్లకు రష్యన్ మార్షల్ ఆర్ట్ "Sambo"పై దృష్టి పెట్టారు. 


రష్యన్ రాజకీయ నేత మృతి..


రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను విమర్శించిన ఒక రష్యన్ రాజకీయ నేత అనుమానాస్పదంగా మృతి చెందారు. ఒడిశాలోని రాయగడలోని ఒక హోటల్‌లోని మూడవ అంతస్తు కిటికీ నుండి పడి ఆయన మరణించినట్లు టెలిగ్రాఫ్ తెలిపింది. పుతిన్‌కు చెందిన యునైటెడ్ రష్యా పార్టీ నేత, మిలియనీర్ అయిన పావెల్ ఆంటోవ్ మృతి చెందడం కలకలం రేపింది. తన 66వ పుట్టినరోజును జరుపుకోవడానికి ఆయన భారత్‌ వచ్చారు. కానీ రాయగడలోని హోటల్ సాయి ఇంటర్నేషనల్ వెలుపల రక్తపు మడుగులో ఆయన పడి ఉన్నారు. పావెల్ మరణాన్ని రాయగడ పోలీసులు ధ్రువీకరించారు. ఇది ఆత్మహత్యగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. "తన స్నేహితుడి మరణం కారణంగా పావెల్ డిప్రెషన్‌లో ఉన్నారు" అని సీనియర్ పోలీసు అధికారి తెలిపారు.


Also Read: Rahul Gandhi: "పప్పు" కామెంట్స్‌పై స్పందించిన రాహుల్, ఆమెను కూడా అలాగే అన్నారంటూ ఆసక్తికర వ్యాఖ్యలు