Vice-Presidential Election 2022: ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్‌డీఏ అభ్యర్థి జగదీప్ ధన్‌ఖడ్‌కు తమ మద్దతు ఇస్తున్నట్లు ఉత్తర్‌ప్రదేశ్ మాజీ సీఎం, బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి ప్రకటించారు. ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు మాయావతి ట్వీట్ చేశారు.
ఆ రోజే ఫలితాలు
ఉపరాష్ట్రపతి ఎన్నికలు ఈ నెల 6న జరగనున్నాయి. అదే రోజు ఫలితాలు ప్రకటిస్తారు. ఆగస్టు 10తో ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడి పదవీకాలం పూర్తి కానుంది.
ఎన్‌డీఏ అభ్యర్థిగా బంగాల్ మాజీ గవర్నర్ జగదీప్ ధన్‌ఖడ్ బరిలో నిలిచారు. విపక్షాల అభ్యర్థిగా మార్గరెట్ అల్వా పోటీ చేస్తున్నారు. ఝార్ఖండ్ ముక్తి మోర్చా (JMM), శివసేన (ఉద్ధవ్ ఠాక్రే వర్గం) ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థి మార్గరెట్ అల్వాకు మద్దతు ప్రకటించాయి.
Also Read: Ruchira Kamboj: ఐరాసలో శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్- మొట్టమొదటి మహిళగా రికార్డ్!
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 47 మంది మృతి