Corona Cases: దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి. కొత్తగా 17,135 కరోనా కేసులు నమోదయ్యాయి. 47 మంది మృతి చెందారు. కొవిడ్​ నుంచి తాజాగా 19,823 మంది కోలుకున్నారు. రికవరీ రేటు 98.49 శాతానికి చేరింది.







  • మొత్తం కేసులు: 4,40,67,144

  • మొత్తం మరణాలు: 5,26,477

  • యాక్టివ్​ కేసులు: 1,37,057

  • మొత్తం రికవరీలు: 4,34,03,610


వ్యాక్సినేషన్






దేశంలో కొత్తగా 23,49,651 మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 204.84 కోట్లు దాటింది. మరో 4,64,919 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.


కరోనా ఫోర్త్ వేవ్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ఇప్పటికే పలు రిపోర్ట్‌లు వస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో భారత్‌లో కూడా ఫోర్త్ వేవ్ వచ్చే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


కరోనా నిబంధనలను తప్పకుండా పాటించేలా చూడాలని కేంద్రం.. రాష్ట్రాలను ఆదేశించింది. కరోనా టెస్టులను పెద్ద ఎత్తున నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. మాస్కులు తప్పనిసరిగా వినియోగించాలని కోరింది. మరోవైపు వ్యాక్సినేషన్ కార్యక్రామాన్ని కూడా వేగంగా కొనసాగించాలని నిర్ణయించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వ్యాక్సినేషన్‌లో మరో కొత్త మైలురాయిని చేరింది భారత్. దేశవ్యాప్తంగా 200 కోట్ల వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ.


మంకీపాక్స్ కలవరం


మరోవైపు మంకీపాక్స్ కూడా దేశంలో కలవరం రేపుతోంది. దీంతో మంకీపాక్స్‌పై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం కొన్ని గైడ్‌లైన్స్ విడుదల చేసింది. ఈ వైరస్‌ను కట్టడి చేసేందుకు Do's and Dont'sను వివరించింది. 


మంకీపాక్స్‌ సోకిన వ్యక్తితో చాలా కాలం పాటు సన్నిహితంగా ఉన్న వారికీ ఈ వైరస్ సోకే ప్రమాదముంది. అందుకే..కాస్త అనుమానం వచ్చిన వెంటనే జాగ్రత్తపడాలని సూచిస్తోంది కేంద్ర ఆరోగ్య శాఖ. 


Also Read: Monkeypox Virus: మంకీపాక్స్‌ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి - కేంద్రం గైడ్‌లైన్స్ ఇవే


Also Read: Black Tiger: ఒడిశా సిమిలాపాల్ నేషనల్ పార్కులో నల్ల పులి, వీడియో వైరల్!