నందు తులసితో మాట్లాడటానికి తన ఇంటికి వస్తాడు. పిల్లల గురించా అని అడుగుతుంది. మీరు చెప్పాలనుకున్న విషయం నేను ఇబ్బంది పడేదా మీరు ఇబ్బంది పడేదా అని అడుగుతుంది. నా జీవితానికేమి హ్యపీగా ఉన్నాను. అందమైన భార్య, మంచి ఇల్లు, కారు, నాలుగు చేతులా సంపాదన ఇంకేం కావాలి ఇంతకన్నా అని నందు అంటాడు. మీ కన్న తల్లిదండ్రులు అని అంటుంది. వాళ్ళు లేకుండా ఎన్ని ఉన్నా లేనట్టే అని చెప్తుంది. మన పాస్ట్ గురించి మాట్లాడటానికి రాలేదని చెప్తాడు. మనం అనుకోకుండా సామ్రాట్ గారి దగ్గర పని చేస్తున్నాం. ఒక నిజం సామ్రాట్ గారికి తెలియకుండా ఉంటే మంచిదని అనిపిస్తుందని నందు అంటాడు. ఏంటా నిజం అని తులసి అడుగుతుంది. నేను నీ భర్తని.. అదే మాజీ భర్తని అనే విషయం.
తులసి: తెలిస్తే తెలియనివ్వండి నాకేం అభ్యతరం లేదు
నందు: సమస్య నీకు కాదు నాకు. ఆయనకి నువ్వంటే సాఫ్ట్ కార్నర్, నువ్వంటే ఉండే ఇష్టం అది నా మీద కోపంగా మారొచ్చు. ఏవైనా జరగవచ్చు. అర్థం చేసుకో తులసి
తులసి: నిజం చెప్పినంత మాత్రాన గతం మార్చలేము కదా
నందు: మార్చలేము కానీ దాచగలం కదా
తులసి: ఓడలు బండ్లు అవడం అంటే ఇదేనేమో.. గతంలో నేను మీ భార్యని అని చెప్పుకోడానికి అసహ్యపడే వాళ్ళు. ఇప్పుడు నా మాజీ భర్త అని చెప్పేందుకు భయపడుతున్నారు. అయినా నేను అబద్ధం చెప్పనని మీకు తెలుసు మరి ఏ నమ్మకంతో మీరు నన్ను అడగడానికి వచ్చారు
నందు: ఇది భయం కాదు.. ఈ అబద్ధం వల్ల ఎవరికి నష్టం కూడ లేదు
తులసి: అబద్ధాలు చెప్పే అలవాటు నాకు లేదు. మీరు నా ముగ్గురు పిల్లలకి తండ్రి కాబట్టి ఒక సాయం చేస్తాను సామ్రాట్ గారికి నా అంతట నేను నిజం చెప్పను అడిగితే మాత్రం అబద్ధం చెప్పను మీకోసం నేను నా వ్యక్తిత్వాన్ని మార్చుకొను
నందు: తనంతట తాను నిజం చెప్పను అని మాట ఇచ్చింది చాలు
Also Read: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్, ఖుషి ప్లాన్ సక్సెస్
సామ్రాట్ పార్టీకి రెడీ అవుతూ ఉంటాడు. అది చూసి హనీ అసలు బాగోలేదు నువ్వు టీ షర్ట్ వేసుకోవాలి అని సెలెక్ట్ చేస్తుంది. ఈరోజు మన ఇంట్లో పార్టీ వాళ్ళందరి ముందు హీరోలా ఉండాలని అంటుంది. హనీ చెప్పినట్టుగానే సామ్రాట్ టీ షర్ట్ వేసుకుంటాడు. నందు వచ్చిన విషయం తులసి ఇంట్లో వాళ్ళకి చెప్తుంది. వాడి అవసరం కోసం నువ్వు ఎందుకు సహాయం చేస్తావ్అని అనసూయ అంటుంది. ఇక నందు గురించి ఎవ్వరూ చెప్పొద్దని తులసి ఇంట్లో వాళ్ళకి చెప్పడంతో అందరూ సరే అంటారు. ఇక అందరూ కలిసి సామ్రాట్ ఇంటికి వస్తారు. వాళ్ళు వచ్చిన వెంటనే లాస్య, నందు లక్కీని తీసుకుని వస్తారు. కాసేపు లాస్య, ప్రేమ్ మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. టాపిక్ ఎటో వెళ్తుంది ఇది ఇంతటితో ఆపేయ్యమని సామ్రాట్ అంటాడు.
Also Read: రుక్మిణి ఇంటికి వచ్చిన భాగ్యమ్మ- తల్లిని చూసి ఆనందపడిన రుక్కు, ఆదిత్యకి క్లాస్ పీకిన సత్య
మీ ఇల్లు చాలా బాగుంది ప్యాలెస్ లాగా ఉందని దివ్య సంతోషంగా చెప్తుంది. అది చూసి లాస్య నందుకి ఎక్కించే ప్రయత్నం చేస్తుంది. హనికి ఇంటి నిండా మనుషులు కావాలి, అలాంటి రోజు ఒకటి రాకపోతుందా అని మేము బిక్కు బిక్కుమంటూ ఎదురు చూస్తూన్నామని సామ్రాట్ అంటాడు. మీరందరూ కూర్చోండి నేను వంట చేస్తానని సామ్రాట్ అంటాడు. మీరు చేస్తారా అని తులసి అంటుంది. మావాడు నలభీముడికి ఏం తీసిపోడని సామ్రాట్ వాళ్ళ బాబాయ్ చెప్తాడు. మా నందు కూడా కుకింగ్ లో సూపర్ అని లాస్య అంటుంది. అయితే ఈ రోజు వంట నలభీములదే అని సామ్రాట్ అంటాడు. ఇక రెండు టీములుగా విడిపోయి వంట చేద్దామని లాస్య ఐడియా ఇస్తుంది. నందు టీం లో ప్రేమ్, అంకిత ఉంటారు. సామ్రాట్ టీం లో దివ్య, అభి ఉంటారని చెప్తుంది లాస్య. నన్ను ఎందుకు ఇరికించవని లాస్యని తిడతాడు నందు. నేను ఉంటాను కదా నీకు హెల్ప్ చేస్తానని అంటుంది లాస్య.