వ్రతం అయ్యేదాక నోటికి పని తగ్గించమని గోవిందరాజులు మల్లికకి వార్నింగ్ ఇస్తాడు. జ్ఞానంబ వచ్చి దేవుడి విగ్రహాన్ని శుబ్రం చెయ్యమని మల్లికకి ఇస్తుంది. అది చూసి జానకి గతంలో జ్ఞానంబ తనకి ఇచ్చిన విషయం గుర్తు చేసుకుని బాధపడుతుంది. మరో వైపు రామా వంట చేస్తూ జ్ఞానంబ, జానకి మాటలు తలుచుకుని బాధపడుతూ ఉంటాడు. ఒకవైపు అమ్మ బాధపడుతుంది.. మరో వైపు అమ్మ మాట్లాడకుండా ఉంటుంది. ఇవి సర్దుకుంటాయని అనుకుంటున్నానే తప్ప ఎప్పటికీ సర్దుకుంటాయో అని అనుకుంటూ ఉండగా రామా చేతి మీద వేడి నూనె పడి అల్లాడిపోతాడు. జ్ఞానంబ అది చూసి మౌనంగా నిల్చుని ఉంటుంది. జానకి వచ్చి మందు రాస్తానని అంటుంది కానీ రామా ఒప్పుకోడు. అమ్మ నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలినా నాదగ్గరకి రాకుండా ఉండేసరికి నా ప్రాణమే పోయినట్టు ఉంది దానితో పోలిస్తే ఇదేమి పెద్దది కాదులెండి అని రామా అంటాడు. అది విని జ్ఞానంబ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. జానకి మాత్రం రామా మాటలు వినకుండా తీసుకెళ్ళి చేతికి అయిన గాయానికి మందు రాస్తుంది.
రామా బాధపడటం చూసి జ్ఞానంబ గుండె తరుక్కుపోతుంది. జానకి ఏడుస్తూ గాయానికి వెన్న రాస్తుంది. రామా అంతగా బాధపడుతున్నా కానీ జ్ఞానంబ కరగకుండా ఉండేసరికి రామా విలావిల్లాడిపోతాడు. తనకి చిన్న దెబ్బ తగిలినా మా అమ్మ తట్టుకోలేదు, నా కళ్లలో నీళ్ళు వస్తే మా అమ్మ ప్రాణం విలవిల్లాడిపోయేది. నాకు ఇంత పెద్ద గాయం అయ్యిన బాధకంటే మా అమ్మ వైపు దీనంగా చూస్తూ ఉంటే మా అమ్మ రాకుండా ఉంటే ఆ బాధ న గుండెని మెలిపెడుతుంది. ఆ బాధని భరించడం చాలా కష్టంగా ఉంటుంది. పిల్లలు ఎంత బాధపెట్టినా ఆ పిల్లలు బాధపడితే తల్లి గుండె తట్టుకోలేదు. ఈ విషయంలో మా అమ్మ అందరి కంటే కాస్త ఎక్కువ. ఇక్కడ నేను ఎంతలా బాధపడుతున్నానో అంతలా మా అమ్మ కూడా బాధపడుతుంది. మందు రాయలేకపోతున్నా అని కంట తడి పెట్టుకుంటూ ఉంటుందని రామా అంటాడు. ఆ సన్నివేశంలో తల్లి, కొడుకుల ప్రేమ ప్రేక్షకుల హృదయాలని కత్తిపడేస్తుంది. పాపం ఈ అమ్మ ఇంక మందు రాయలేదని నా బిడ్డ బాధపడుతూ ఉంటాడు. పండగ రోజు ఎందుకు తల్లి నా బిడ్డని ఇలా బాధపెడుతున్నావని జ్ఞానంబ కుమిలిపోతుంది.
Also Read: ఎవరికి కనిపించకుండా వెళ్లిపోతానన్న రుక్మిణి- దేవి గురించి అదిత్యని నిలదీసిన సత్య
పూజకి ముత్తైదువులందరూ జ్ఞానంబ ఇంటికి వస్తారు. ఇల్లంతా పండగ సందడి ఉంది కానీ నీ ముఖంలో లేదేంటి అని నీలావతి జ్ఞానంబని అడుగుతుంది. అదేమీ లేదని అంటుంది. ఇక వ్రతం పనులన్నీ పెద్ద కోడలు చేయలేదేంటి అని నీలావతి అడుగుతుంది. మల్లిక అసలు విషయం చెప్తుంటే జ్ఞానంబ ఆపుతుంది. పోయినసారి జానకి చేసింది అందుకని ఈసారి మల్లికతో చెపిస్తున్న అని జ్ఞానంబ చెప్తుంది. పుల్లలు పెట్టె నీలావతి గోడ మీద జానకి, రామా ఫోటో లేదేంటి అని అడుగుతుంది. ఫోటో పగిలిపోయింది ఒకసారి ముక్కలు అయితే అతుక్కోవడం కష్టం కదా అని జ్ఞానంబ అంటుంది. ఇక దేవుడి విగ్రహాన్ని తీసుకుని పీటల మీద పెట్టమని గోవిందరాజులు జానకికి చెప్తాడు. పూజ పనులు జానకితో చేయించేందుకు ప్రయత్నిస్తాడు. జానకి సంతోషంగా వెళ్ళి విగ్రహం పెట్టి పూజ చేస్తుంటే చూసి మల్లిక ఏడుస్తుంది.