దేవుడమ్మ తన దగ్గరకి వచ్చి మాట్లాడిన విషయం మొత్తం భాగ్యమ్మ రుక్మిణికి చెప్తుంది. ఆ తల్లి నీ కోసం అంతగా ఏడుస్తుంటే నాకే మస్త్ బాధగా అనిపిస్తుంది, పదా మన ఇంటికి వెళ్లిపోదాం అని తీసుకుని వెళ్తుంటే రుక్మిణి ఆపుతుంది. ఏం మాట్లాడుతున్నావో అర్థం అవుతుందా.. నేను ఆ ఇంటికి ఎట్లా రావలే ఏ మొహం పెట్టుకుని రావాలని అడుగుతుంది. అలా ఏమి ఉండదు బిడ్డ నువ్వు వస్తే నిన్ను కళ్ళల్లో పెట్టుకుని చూసుకుంటది సర్ది చెప్పేందుకు ప్రయత్నిస్తుంది. కానీ రుక్మిణి మాత్రం అందుకు ఒప్పుకోదు. వచ్చేదాన్ని అయితే అప్పుడే ఇంటికి వెళ్ళేదాన్ని పదేళ్ళు ఇంటికి దూరంగా ఉండేటి దాన్నా.. ఇప్పుడు వచ్చి నా చెల్లి కాపురం నన్ను ఆగం చెయ్యమంటావా.. అత్తమ్మ బాధపడుతుందని నా గురించి చెప్తే ఈసారి దూరంగా వెళ్లిపోతాను ఎవరికి కనిపించను అని బెదిరిస్తుంది. నువ్వు చెప్పినట్టే వింటా అలా ఏమి చెయ్యకు అని భాగ్యమ్మ అంటుంది. ఆ మాధవసారు బిడ్డకి ఏడేదో చెప్పి మనసు పాడు చేస్తున్నాడని చెప్పుకుని రుక్మిణి బాధపడుతుంది. అయితే నేను ఇక్కడికే వస్తా నీకు కాసింత ధైర్యంగా ఉంటుంది.. స్కూల్ దగ్గర పని మానేసి నీతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాని అని అంటుంది. ఈ ఇంట్లో ఎలా ఉంటావమ్మ అని రుక్మిణి అడిగితే పని మనిషిని అని చెప్పు ఇంట్లో పని చెయ్యడానికి వచ్చానని చెప్పమని చెప్తుంది. నువ్వు రమ్మన్నా వద్దన్నా నేను వస్తాను అంటే అని భాగ్యమ్మ తెగేసి చెప్పి వెళ్ళిపోతుంది.
Also Read: ఖైలాష్ ని విడిపించనని తెగేసి చెప్పిన యష్- ఖుషి క్యూట్ ప్లాన్, గదిలో లాక్ అయిపోయిన వేద, యష్
దేవి కరాటే నేర్చుకునే దగ్గరకి ఆదిత్య వస్తాడు. ముఖాన దెబ్బలు చూసి ఏమైందని అడుగుతాడు. దోస్త్ లు కలబడ్డారు లొల్లి అయ్యిందని చెప్తుంది. నన్ను కొట్టారని అక్క వచ్చి వాళ్ళని కొట్టిందని చెప్తుంది. నాకు ఇలా దెబ్బలు తగిలాయని మాయమ్మ నన్ను తీసుకొచ్చి కరాటేలో చేర్పించిందని చెప్తుంది. కరాటే బాగా నేర్చుకుంటా నువ్వు మా నాయాన్ని వెతికి తీసుకొస్తావ్ కదా అప్పుడు మా నాయన అగుపించగానే రప్పు రప్పున కొడతా. మాయమ్మని కొట్టినడు కదా అంతకంటే ఎక్కువగా కొడతా అంటుంది. ఆ మాటలకి ఆదిత్య మండిపోతాడు. 'మాధవ్ నా బిడ్డ మనసంతా విషంతో నింపేశావ్ కదరా ఆ రోజు కొట్టేది ఎంతో మళ్ళీ లేవకుండా కొట్టి ఉండాల్సింది చిన్మయి బాధపడుతుందని తప్పు చేశాను. ఇంక అమ్మకి విషయం చెప్పకుండా ఉండటం మంచిది కాదు. నాకు ఆ మాధవగాడు ఇంకా దూరం చేయక ముందే అమ్మకి విషయం చెప్పేయ్యాలి. ఈరోజే అమ్మకి విషయం చెప్పేస్తాను' అని మనసులో అనుకుంటాడు. ఆఫీసుకి సరిగా వెళ్ళడం లేదంట కదా ఫైల్స్ తీసుకొచ్చి ఇచ్చారు.. భార్య భర్త అంటే కష్టం సుఖం పంచుకోవాలి. మరి ఏంటి ఆదిత్య నీ సమస్య అని సత్య నిలదిస్తుంది. చెప్పాల్సిన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని ఆదిత్య అంటాడు. దేవి అంటే నీకు ఇస్తాం ఉండొచ్చు కానీ ఇలా ఇల్లు, ఆఫీసు వదిలేసి దేవి చుట్టూ తిరగడం ఏమి బాగోలేదని సత్య కోపంగా అంటుంది. నువ్వు అనుకున్నట్టు దేవి మాధవ కూతురు కాదు నా కూతురు ఈ విషయం నేను నీకు చెప్పలేను అని ఆదిత్య అనుకుంటాడు.
Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన
ఇంట్లో కరాటే ప్రాక్టీస్ చేస్తూ ఉండటం చూసి జానకి బిత్తరపోతుంది. ఇక రామూర్తి మాత్రం కరాటే నేర్చుకోమని ప్రోత్సహిస్తాడు. కమల, భాషా దేవుడమ్మ దగ్గరకి వస్తుంది. నాకు ఆడపిల్ల పుడితే రుక్కు పేరు పెట్టుకుందామని అనుకుంటున్నా, నా కంటే చిన్నది అయినా మా కోసం చాలా కష్టపడింది. మాయమ్మ నన్ను చెల్లిని ఏ పొద్దయినా యాది మరిచిందేమో గాని అమ్మని మమ్మల్ని ఎప్పుడు అమ్మ లెక్కనే చూసింది మా రుక్కు అని కమల బాధపడుతుంది. రుక్మిణి బతికే ఉంది నీకు కాన్పు అయ్యే సమాయనికి రుక్మిణి ఈ ఇంట్లో అడుగు పెడుతుంది.. ఆ నమ్మకం తనకి ఉందని, నీ బిడ్డ అలనా పాలనా చూస్తుంది అని దేవుడమ్మ సంతోషంగా చెప్తుంది. ఇక రుక్మిణి దేవి తన తండ్రి గురించి అన్న మాటలు తలుచుకుని మాధవ మీద కోప్పడుతుంది. మాధవ సారు గురించి నేను నా బిడ్డకి చెప్పలేను, ఇంట్లోనూ చెప్పలేను, నా కోసమే ఇలా చేస్తున్నాడని నా పెనిమిటికి చెప్తే సీదా వెళ్ళి అతని ప్రాణం తీసి జైల్లో కూర్చుంటాడు. ఏం చెయ్యాలి నాకు అండగా ఉండేందుకు ఆట సాయం చేయడానికి ఎవరు ఉన్నారు ఒంటిగా నేను ఎన్ని దినాలు పోరాడాలి అని బాధపడుతుంది.