కాంచన ఏమి తినకుండా ఏడుస్తూ ఉంటుంది. అప్పుడే యష్ ఆఫీసుకి వెళ్తుంటే మాలిని పిలుస్తుంది. 'అయ్యిందేదో అయిపోయింది ఒక పీడ కలగా అంతా మర్చిపోదాం అందరం హ్యాపీ గా ఉన్నాం కానీ కంచుని చూడరా లోలోపల ఎంత బాధపడుతుందో. ఇంటి ఆడపడుచు నట్టింట్లో కన్నీరు కారిస్తే మంచిది కాదు అందుకని ఖైలాష్ ని విడిపించరా.. కేసు వాపస్ తీసుకుని జైలు నునహకి బయటికి తీసుకుని రా.. తమ్ముడివి నువ్వు కాక ఎవరు సహాయం చేస్తారు రా' అని మాలిని యష్ ని అడుగుతుంది. అమ్మా సూటిగా ఒక ప్రశ్న అడుగుతాను సమాధానం చెప్పమని యష్ అంటాడు. జరిగిన దాంట్లో తప్పు ఎవరిదని అడుగుతాడు. తప్పు ఖైలాష్ ది కాదు.. వేదది కాదు తప్పు నాది అని అంటుంది. ఆ మాటకి కాంచన ఏడుస్తూ లోపల్లికి వెళ్ళిపోతుంది. 'కూతురు ఏమైపోతుందో అని నిజాన్ని అంగీకరించలేని అత్త స్థానంలో ఉన్నాను రా.. కంచు ఏమైపోతుందోనన్న భయంతో నా కోడలితో మాట్లాడలేకపోయాను.. తల్లి ప్రేమ ఇలాగే ఉంటుంది నాన్న.. అది ఎవరికి అర్థం కాదు.. ఆ రోజు ఖైలాష్ గురించి వేద అందరి కంటే ముందు నాకే చెప్పింది ఆ రోజే యాక్షన్ తీసుకుని ఉంటే పరిస్థితి ఇంత దూరం వచ్చి ఉండేది కాదు నా వల్ల జరిగిన తప్పుకి ఏ పాపం తెలియని మన ఇంటి కోడలు ఆ పోలీసు లాకప్ లో గడపాల్సి వచ్చింది. ఆ అవమానం మన వేదకే కాదు మన ఫ్యామిలీలో అందరికీ. ఇంతకన్నా ఏం చెయ్యగలను నాన్న. నువ్వు కూడా దీని గురించి తెలిసినప్పుడు మాట్లాడలేకపోయావు.. ఆ పరిస్థితి వల్లే నేను మాట్లాడలేకపోయాను. నా వల్ల జరిగిన తప్పుకి నా కోడలు నష్టపోయింది.. ఇప్పుడు నా కూతురు కూడ నష్టపోతే తట్టుకోలేను. ఆ ఖైలాష్ మంచి వాదో చెడ్డవాడో మన కాంచన భర్త వదులుకోలేము కదా.. అందుకే కేసు వాపసు తీసుకుని ఖైలాష్ ని దానికి అప్పగించేద్దాం. నా మొహం చూసి ఈ ఒక్కసారికి ఖైలాష్ ని విడిపించు' అని బతిమలాడుతుంది.
Also Read: వేద, యష్ ని కలిపేందుకు ఖుషి చీటీల ఆట - ఖైలాష్ గురించి తెలుసుకున్న అభి, కన్నింగ్ ప్లాన్స్ రెడీ
నీ మాట నేను గౌరవిస్తాను, అక్కకి జీవితాంతం నేను అండగా నిలుస్తాను కానీ అక్క విషయం వేరు ఆ ఖైలాష్ విషయం వేరు. ఖైలాష్ కి శిక్ష పడాల్సిందే. వేద విషయంలో ఏది జరగకూడదో అది జరిగింది. ఖైలాష్ విషయంలో ఏది జరగాలో అదే జరిగింది. వాడి భవిష్యత్ నేను కాదు ఆ భగవంతుడు నిర్ణయిస్తాడని యష్ అంటాడు. ఆ మాటలకి మాలిని ఏడుస్తూ ఎప్పుడు నేను నిన్ను ఏమి అడగలేదు ఫస్ట్ టైం అడుగుతున్నాను ఖైలాష్ ని విడిపించేద్దాం ప్లీజ్ నాన్న అని బ్రతిమలాడుతుంది. కానీ యష్ మాత్రం ఒప్పుకోడు.
ఖైలాష్ మన ఆయుధం వాడు ఇప్పుడు తోక తొక్కిన తాచు. వాడిని మన వైపు తిప్పుకుని యష్ మీదకి ప్రయోగించవచ్చు అని అభి అంటాడు. ఆయుధం ఖైలాష్ కాదు కాంచన. భర్తని పిచ్చిగా ప్రేమించే కాంచన ఇప్పుడు గొప్ప ఆయుధం. తన భర్తని జైలుకి పంపించినందుకు పగతో రగిలిపోతూ ఉంటుంది తనని అడ్డు పెట్టుకుని వేద జీవితంతో ఆడుకుంటాను అని మాళవిక అంటుంది. వేద, యష్ కారులో వెళ్తూ ఉండగా ఖైలాష్ ని విడిపించడం గురించి అడుగుతుంది. నిన్ను క్షోభ పెట్టిన ఖైలాష్ ని వదిలిపెట్టేదె లేదు అని యష్ మరోసారి చెప్తాడు. ఏ విషయంలో అయిన నువ్వు చెప్పినట్టు వింటాను వేద కానీ ఈ విషయంలో మాత్రం వినను అని అంటాడు. సమయం చూసుకుని ఎప్పుడు ఏం చెయ్యాలో అది చేస్తాను అని అంటాడు. యష్ వాళ్ళ కారు టైర్ పంక్చర్ అవడంతో టైర్ మార్చమని అంటుంది. రాదని యష్ చెప్పేసరికి వేదనే మారుస్తుంది. అప్పుడు రోడ్డు మీద వెళ్తున్న అందరూ యష్ ని చూసి ఒక ఆడపిల్లతో టైర్ మార్పిస్తావా అని తిడతారు. వేదని పొగుడుతూ ఉంటారు. అప్పుడే అటుగా వెళ్తున్న అభిమన్యు మాళవిక వాళ్ళని చూసి ఆగుతారు. నీకు టైర్ మార్చడం కూడా వచ్చా నా లైఫ్ లో ఫస్ట్ టైం ఇలాంటివి చూస్తున్నా అని అభి అంటాడు.
Also Read: రుక్మిణి నీదగ్గరకి వచ్చిందా అని భాగ్యమ్మని నిలదీసిన దేవుడమ్మ- రుక్మిణి దగ్గర సత్య ఆవేదన