'మాధవ సారు గలీజ్ గా తయారయ్యాడు, వాళ్ళ అమ్మానాన్నలకి గా సారు ఎటువంటి కథలు పడుతున్నాడో తెలవదు, నేను ఇప్పుడు నా బిడ్డకి చెప్పనికి లేదు, ఇంట్లో చెప్పడానికి లేదు, గా సారు ఇట్లా చేస్తుండు అని నా పెనిమిటికి చెప్తే మాధవ సారు ప్రాణం తీసి సీదా పోయి జైల్లో కూర్చుంటాడు.. ఏం చెయ్యాలి గీసువంటప్పుడు నాకు అండగా ఉంది ధైర్యం చెప్పడానికి ఎవరు ఉన్నారు. ఒంటిగా ఎన్ని దినాలు ఇలా పోరాడాలి' అని రుక్మిణి బాధపడుతూ ఉంటుంది. తన తల్లి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటుంది. నాకు తోడుగా మాయమ్మ ఉంటది.. భాగ్యమ్మ మాయమ్మ అని మాధవ సారుకి ఎరుకే నాతో మాట్లాడటానికి కొద్దిగా సొచ్చాయిస్తాడు. మాయమ్మని నాదగ్గరకి రమ్మని అనాలె నాకు తోడుగా ఉండమని అడగాలే అని అనుకుంటుంది.
Also Read: వేద, యష్ రొమాంటిక్ మూమెంట్, ఖుషి ప్లాన్ సక్సెస్
దేవి కరాటే ప్రాక్టీస్ చెయ్యడం చూసి చిన్మయి నవ్వుతుంది. మనం ఇద్దరం పోటీ పెట్టుకుందామా అని అనుకుంటారు. నా చేతిలో ఒడిపోతావ్ పరేషన్ అవుతావ్ వద్దు అని దేవి అన్నా వినకుండా చిన్మయి ఏం పర్వాలేదని అంటుంది. జానకి, రామూర్తి, రాధ ముగ్గురు నిలబడి వాళ్ళని చూస్తూ ఉంటారు. ఇక ఇద్దర్నీ కళ్ళు మూసుకుని దేవుడిని తలుచుకోమని రామూర్తి చెప్తాడు. అప్పుడు చిన్మయి రాధని తలుచుకుంటూ అమ్మ అని అంటుంది. అది విని జానకి, రాధ ఆశ్చర్యపోతారు. ఇక దేవి కళ్ళు మూసుకుంటే ముందు ఆదిత్య ముఖం, తర్వాత మాధవ కనిపిస్తాడు. ఎవరిని తలుచుకోవాలో అర్థం కాక కళ్ళు తెరిచి తల్లి వైపు చూస్తే ఆఫీసర్ సారు అని చెప్తుంది. ఇక దేవి మళ్ళీ కళ్ళు మూసుకుని ఆఫీసర్ సారు అని అనేసరికి జానకి, రామూర్తి ఇద్దరు షాక్ అవుతారు. ఇక దేవి, చిన్మయి పోటీ పెట్టుకోగా దేవినే గెలుస్తుంది. నేను నిన్నే తలుచుకున్నాను అయినా కానీ ఒడిపోయానమ్మా అని చిన్మయి ముఖం ముడుచుకుని రాధని అడుగుతుంది. దేవమ్మ కరాటే నేర్చుకుంటుంది కదా అందుకే గెలిచింది నువ్వు అమ్మవి కదా అమ్మ ఇలా పోట్లాటలు పెట్టుకోదు, ఇంట్లో అందరికీ చక్కగా వంట చేసి పెడుతుంది.. పదా మనం వెళ్ళి వంట చేసుకుందాం అని చెప్తుంది. అందుకు చిన్మయి సరే అంటుంది.
Also Read: రామా చేతికి గాయం, కనికరించని జ్ఞానంబ- జానకి చేతుల మీదగా వరలక్ష్మి వ్రతం పూజ
ఆదిత్య రుక్మిణి కలిసేందుకు వెళ్తుంటే సత్య ఆపుతుంది. ఎక్కడికి వెళ్తున్నావ్ ఆఫీసు టైం లో ఎక్కడికి వెళ్లకు ఏవైనా పనులు ఉంటే తర్వాత చూసుకోమని సత్య అదిత్యకి క్లాస్ పీకుతుంది. జానకి, రామూర్తి మాధవ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. మాధవ ఈ మధ్య అసలు బయటికే రావడం లేదని రామూర్తి బాధపడతాడు. రాధని ఇష్టపడుతున్నాడు, తన ముందు తిరుగుతూ తనని ఇబ్బంది పెట్టాలేక గదిలోనే ఉంటున్నాడని జానకి చెప్తుంది. ఆ అమ్మాయికి మనసులో అటువంటి ఆలోచన లేనప్పుడు ఎందుకు ఇంకా తన గురించి ఆలోచించడం అని రామూర్తి అంటూ ఉండగా భాగ్యమ్మ వస్తుంది. మీరు ఆఫీసర్ సార్ ఇంట్లో ఉంటారు కదా అని అడుగుతాడు. నాతో ఏమైనా పని ఉందా అని రామూర్తి అడుగుతాడు. ఈ ఇంట్లో పని చెయ్యడానికి వచ్చినా అని భాగ్యమ్మ చెప్తుంది. నా బిడ్డ, అల్లుడు ఆఫీసర్ సార్ ఇంట్లో ఉంటున్నారు నేను ఉంటే బాగుండదని వచ్చాను అంటుంది. మొన్న మీ పొలంలో పని చేసుకుంటుంటే ఎండ దెబ్బ తగిలి పడిపోయాను అప్పుడు రాధమ్మ ఈ వయసులో ఎండలో పని చెయ్యడం ఎందుకు మా ఇంట్లో పని చేసుకో అని చెప్పింది అందుకే వచ్చినా అని భాగ్యమ్మ వాళ్ళకి చెప్తుంది. మా రాధ చెప్తే ఇంక మేము మాట్లాడేపనే లేదు మా రాధ అన్ని ఆలోచించేది చెప్తుంది అని అంటారు. వంట గదిలో ఉంది వెళ్ళమని చెప్తారు. భాగ్యమ్మని చూడగానే రుక్మిణి చాలా సంతోషిస్తుంది. ఇంత మంచి వాళ్ళకి ఆ గలిజోడు ఎట్లా పుట్టినాడని భాగ్యమ్మ అంటుంది. వాళ్ళ ముఖం చూసే నేను ఈ ఇంట్లో నుంచి బయటకి రాలేకపోతున్నాని రుక్మిణి అంటుంది. నిజమే బిడ్డ వాళ్ళ మాటలు విన్నాక ఇన్నేళ్ళు ఈ ఇంట్లో ఎందుకు ఉన్నావో అర్థం అయ్యిందని భాగ్యమ్మ అంటుంది. ఇక మాధవ గాడి సంగతి నేను చూసుకుంటాను.. నా ముందర కనుక నకరాలు చెసినడా బొక్కల్లో గుజ్జు తీస్తా నువ్వేమి పరేషన్ కాకు అని ధైర్యం చెప్తుంది.