Ruchira Kamboj: ఐక్యరాజ్యసమితి శాశ్వత ప్రతినిధిగా సీనియర్ భారత రాయబారి రుచిరా కంబోజ్ బాధ్యతలు స్వీకరించారు. భారత్ తరఫున యునైటెడ్ నేషన్స్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా కంబోజ్ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా "మనందరం సాధించగలం" అని అమ్మాయిలకు రుచిరా సూచన చేశారు.
గుటెరస్ ట్వీట్
భారత్ పక్షాన ఐరాసలో మొట్టమొదటి మహిళా శాశ్వత ప్రతినిధిగా రుచిరా బాధ్యతలు స్వీకరించినట్లు యూఎన్ సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ తెలిపారు.
- రుచిరా కంబోజ్.. 1987 ఇండియన్ ఫారిన్ సర్వీస్ (ఐఎఫ్ఎస్)కు చెందిన అధికారిణి.
- 1987 సివిల్ సర్వీస్ బ్యాచ్‌లో రుచిరా టాపర్.
- రుచిరా మొదట ప్యారిస్‌లో రాయబారిగా ఉద్యోగ జీవితం ప్రారంభించారు.
- అనంతరం రుచిరా దిల్లీకి వచ్చి యూరప్ వెస్ట్ డివిజన్ విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీగా పనిచేశారు.
- 1996 నుంచి 1999 వరకు మారిషస్ ఫస్ట్ సెక్రటరీగా సేవలందించారు.
- దక్షిణాఫ్రికాలో హైకమిషనరుగా పనిచేశారు.
- రుచిరా గతంలో భుటాన్ దేశంలో భారత రాయబారిగా పనిచేశారు.
- ఐక్యరాజ్యసమితిలో ప్రతినిధిగా టీఎస్ తిరుమూర్తి స్థానంలో రుచిరా బాధ్యతలు చేపట్టారు.
ఈ ఘనత సాధించిన రుచిరా కంబోజ్‌కు పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ఇది మహిళా లోకం విజయంగా పేర్కొన్నారు.
Also Read: Corona Cases: దేశంలో కొత్తగా 17వేల కరోనా కేసులు- 47 మంది మృతి
Also Read: Monkeypox Virus: మంకీపాక్స్ రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి - కేంద్రం గైడ్‌లైన్స్ ఇవే