Attack On Hyderabad Traffic Police: ట్రాఫిక్ పోలీస్ తన విధులను సక్రమంగా నిర్వర్తించినందుకు ఆయన మీదే దాడి జరిగింది. నంబర్ ప్లేట్ లేదని ఓ వాహనాన్ని ఆపేందుకు ట్రాఫిక్ ఎస్సై ప్రయత్నించగా, ఆ వాహనదారుడు ఏకంగా ఎస్సై పైనే కత్తితో దాడి చేశాడు. సికింద్రాబాద్ మారేడ్ పల్లి లోని ఓం శాంతి హోటల్ వద్ద అర్ధ రాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. చేయి చాచి వాహనం ఆపుతుండగా, డ్రైవర్ కత్తితో దాడి చేశాడు. దీంతో ఎస్సైకి కడుపు, వెన్ను భాగంలో బాగా గాయాలు అయ్యాయి.


దీంతో గాయాల పాలైన ఎస్సై వినయ్ ని దగ్గరలోని ప్రైవేట్ ఆస్పత్రిలో వెంటనే తోటి పోలీసులు చేర్పించారు. వైద్యం చేసిన డాక్టర్లు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేదని, అవుటాఫ్ డేంజర్ అని చెప్పారు. అయితే, దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులపై పోలీసులు ఫోకస్ పెట్టగా, ఇద్దరు యాప్రాల్ ప్రాంతానికి చెందిన టమాటా పవన్, సంజయ్ గా గుర్తించారు. పరారీలో ఉన్న ఇద్దరి కోసం నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు గాలిస్తున్నారు. వీరు పీడీ యాక్ట్‌ ఉందని, గతంలో చాలా సార్లు జైలుకు వెళ్లి వచ్చారని తేల్చారు. 


Also Read: Revant Reddy : కుక్క బిస్కెట్ల కోసం విశ్వాస ఘాతుకం - ఆర్థిక లావాదేవీల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారన్న రేవంత్ !


వారం క్రితం మరో దాడి
గచ్చిబౌలిలో వారం రోజుల క్రితం కానిస్టేబుల్ పై చైన్ స్నాచర్లు దాడి చేయగా, వారిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నిందితులు ఒకే రోజు సైబరాబాద్ కమిషనరేట్ లోని గచ్చిబౌలి, కూకట్ పల్లి, రామచంద్రపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారు. నిందితులు కర్ణాటక కు చెందిన ఇషన్ నిరంజన్ నీలంనాలి(21), రాహుల్(19) గా గుర్తించారు.


ఈ నిందితులు ఇద్దరు జూలై నెల 25 న ఒకే రోజు గచ్చిబౌలి, కూకట్ పల్లి, రామచంద్రపురంలలో చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. తిరిగి మరుసటి రోజు 26న మియపూర్ లో చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డారు. మియపూర్ నుండి బీహెచ్ఈఎల్ మీదుగా నిందితులు పారిపోయే ప్రయత్నం చేశారని అన్నారు. అన్ని పోలీస్ స్టేషన్ లను అలెర్ట్ చేసి వెహికల్ చెకింగ్ నిర్వహించగా, నిందితులను గుర్తించి ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.


ఈ క్రమంలో ఇద్దరు నిందితులు హెడ్ కానిస్టేబుల్ యాదయ్యపై వివిధ భాగాల్లో మొత్తం 7 చోట్ల కత్తితో దాడి చేశారు. ప్రస్తుతం గాయపడ్డ వారు హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.


Also Read: హుజూరాబాద్‌లో గుద్దితే ఎక్కడో పడ్డారు, మళ్లీ అదే రిపీట్: ఈటల