UP Man Dies: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఓ వివాహ వేడుకలో విషాదం జరిగింది. ఉత్సాహంగా డ్యాన్స్ వేస్తున్న ఓ వ్యక్తి ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఈ వీడియో వైరల్ అవుతోంది.


ఇదీ జరిగింది


వారణాసిలో జరిగిన ఓ వివాహ వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ఓ వ్యక్తి నేలపై కుప్పకూలిపోయి చనిపోయాడు. ఈ  ఘటనలో చనిపోయిన వ్యక్తిని మనోజ్ విశ్వకర్మ గా గుర్తించారు. వివాహ వేడుకలో పాల్గొనేందుకు నవంబర్ 25న చేట్గాంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పిపలని కట్రాకూ అతను వచ్చినట్లు పోలీసులు తెలిపారు. వేడుకలో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయాడని పేర్కొన్నారు.






వేడుకల్లో డాన్స్ చేస్తూ గుండె పోటుతో ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఇంతక ముందు తన వదిన పెళ్ళిలో డాన్స్ చేస్తూ రాజస్థాన్ లోని పాలి జిల్లాకు చెందిన వ్యక్తి మరణించాడు. అలాంటి ఘటనే దహోడ్ జిల్లాలోని దేవగాడ్ బరియాలో 'రాస్' కార్యక్రమం నిర్వహించేటప్పుడు 51 ఏళ్ల వ్యక్తి మరణించాడు.






సెప్టెంబర్ లో కూడా ఉత్తర్‌ప్రదేశ్ లోని మణిపూరిలో గణపతి మంటపంలో హనుమంతుడి వేషధారణలో ఉన్న రాజీవ్ శర్మ అనే వ్యక్తి స్పృహ కోల్పోయి కిందపడగా, ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించాడు.


గత నెలలో ఇలాంటిదే మరో ఘటన జరిగింది. జమ్ము కాశ్మీర్ లోని బిష్ణా లో గణేష్ పూజ కార్యక్రమంలో డాన్స్ చేస్తూ యోగేష్ గుప్తా అనే 20 ఏళ్ల వ్యక్తి మరణించాడు.


Also Read: Shraddha Murder Case: 'శ్రద్ధాను చంపడానికే దిల్లీ తీసుకువచ్చా- చాలా మందితో సంబంధం ఉంది'