UP Massive Fire: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఫిరోజాబాద్ జిల్లాలో జరిగిన ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి చెందారు.


ఇదీ జరిగింది 


జస్రానా ప్రాంతంలోని పాధమ్ పట్టణంలో మంగళవారం ఇన్వర్టర్ బ్యాటరీలో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి. దీంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పెద్దలు, ముగ్గురు పిల్లలు మొత్తం ఆరుగురు మరణించారని ఫిరోజాబాద్ ఎస్‌పీ తెలిపారు. 






ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే 18 అగ్నిమాపక యంత్రాలు, పోలీసులు, సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలను ఆర్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆరుగురు మృతి చెందారు.


సీఎం దిగ్భ్రాంతి


ఈ ఘటనలో జరిగిన ప్రాణనష్టంపై యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి తగిన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని సీఎం ఆకాంక్షించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ట్వీట్‌ చేసింది. మృతుల కుటుంబాలకు తక్షణమే రూ.2 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను అందజేస్తామని సీఎం ప్రకటించారు.










Also Read: Uttar Pradesh: దూసుకెళ్లిన ఎంపీ కాన్వాయ్, చికిత్స పొందుతూ 9 ఏళ్ల బాలుడు మృతి