వాట్సాప్ ద్వారా ఇప్పటి వరకు ఇతర కాంటాక్టులకు మాత్రమే మెసేజ్ పంపించుకునే అవకాశం ఉండేది. మిత్రులు, కుటుంబ సభ్యులతో పాటు తమ కాంటాక్ట్ లిస్టులో ఉన్న వారికి సందేశాలను పంపుకొనే సదుపాయం ఉంది. త్వరలో సరికొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. ఎవరికి వారే మెసేజ్ పంపుకునేలా ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ అనే ఫీచర్ ను వినియోగదారుల ముందుకు తీసుకురాబోతుంది.






‘మెసేజ్ యువర్ సెల్ఫ్’  ఫీచర్ తో లాభాలు ఎన్నో!


సరికొత్తగా అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఈ ఫీచర్ ద్వారా ముఖ్యమైన మెసేజ్ లను తమకు తాముగా పంపుకుని సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ముఖ్యమైన నోట్స్ భద్రపర్చుకునేందుకు ఈ ఫీచర్ వాడుకోవచ్చు. వాస్తవానికి ఇప్పటి వరకు ఈ ఫీచర్ అందుబాటులోకి రాలేదు. కానీ ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ అనే ఫీచర్ ను ఇప్పటికే ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ద్వారా తమకు తాముగా ముఖ్యమైన విషయాలు పంపుకోవచ్చు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఫీచర్ ద్వారా వాట్సాప్ వినియోగదారులు తాము చేయాల్సిన పనులను రిమైండ్ చేసుకునే అవకాశం ఉంది. నోట్స్ తో పాటు పలు అంశాలను మర్చిపోకుండా గుర్తుంచుకునే అవకాశం ఉంది.


త్వరలోనే ఈ ఫీచర్ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. దశల వారిగా ఐవోఎస్, ఆండ్రాయిడ్ ఫోన్ల వినియోగదారుల ముందుకు రానుంది. ఈ ఫీచర్ ను పొందాలి అనుకునే వారు యాప్ స్టోర్ లోకి వెళ్లాలి. అనంతరం వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి. లేటెస్ట్ వెర్షన్ అప్ డేట్ అయ్యాక కొన్ని స్టెప్స్ ఫాలో అయితే ‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్ ను పొందే అవకాశం ఉంటుంది.


‘మెసేజ్ యువర్ సెల్ఫ్’ ఫీచర్ కోసం ఏం చేయాలంటే?


⦿ ముందుగా వాట్సాప్ ను అప్ డేట్ చేసుకోవాలి.


⦿ ఆ తర్వాత వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేయాలి.


⦿ మీ కాంటాక్ట్ లిస్టు పైన భాగంలో చూడాలి.


⦿ వాట్సాప్ ఫీచర్ అందుబాటులో ఉందో? లేదో? చూడవచ్చు.


⦿ మీకు ఈ లేటెస్ట్ ఫీచర్ కనిపించకపోతే అప్ డేట్ రావడానికి ఇంకా సమయం పట్టే అవకాశం ఉంటుంది.


⦿ ఒక వేళ అప్ డేట్ కనిపిస్తే, మీ నంబర్ మీద క్లిక్ చేసి మీకు మీరుగా మెసేజ్ పంపుకునే అవకాశం ఉంది.


పలు ఫీచర్లపై పని చేస్తున్న వాట్సాప్


ఇప్పటికే పలు ఫీచర్ల మీద వాట్సాప్ పని చేస్తోంది. తాజాగా ‘హైడ్ ఆన్ లైన్ స్టేటస్’ ఫీచర్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్ ద్వారా తమ ఆన్ లైన్ స్టేటస్ ఎవరికి కావాలంటే వారికి మాత్రమే కనిపించేలా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఆన్ లైన్ లో ఉన్న తెలియకుండా చాట్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది వాట్సాప్.


Read Also: త్వరలోనే Galaxy S23 సిరీస్ లాంచింగ్, ఫీచర్లు మామూలుగా లేవుగా!